ఆత్మ ప్రబోధం మేరకు : బీజేపీ ఏకపక్ష నిర్ణయం...మిత్రబేధమేనా... ?

Update: 2022-05-26 13:05 GMT
మిత్రుడు శత్రువు అన్నది రాజకీయాల్లో ఎపుడూ ఉండదు, ఏ రోటికాడ ఆ పాట పాడడమే సిసలైన రాజకీయం. ఈ విషయంలో బీజేపీ నాలుగు ఆకులు ఎక్కువే చదివింది అనుకోవాలి. లేకపోతే ఏపీలో జనసేనతోనే తమకు పొత్తు అని ఒక వైపు చెబుతూనే మరో వైపు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే కమలనాధుల కలర్ ఫుల్ పాలిటిక్స్.

విషయానికి వస్తే నెల్లూరు జిల్లా ఆంతకూరు ఉప ఎన్నిక షెడ్యూలు తాజాగా విడుదల అయింది. నోటిఫికేషన్ విడుదలకు ఇంకా టైమ్ ఉంది. అయితే ఇంతలోనే బీజేపీ వారు తొందరపడిపోతున్నారు. అంతే కాదు తాము పోటీలో నిలబడుతున్నట్లుగా ప్రకటించేశారు కూడా. నెల్లూరు ఇల్లా టూర్ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు  మాట్లాడుతూ ఆత్మకూరులో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పేశారు.

అంటే జనసేనతో సంబంధం లేకుండానే పోటీకి దిగిపోతున్నారు అన్న మాట. ఇదే విషయాన్ని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా ప్రకటించడం విశేషం. ఆయన ఏపీలో జనసేనతోనే తమకు మిత్ర బంధం అని చెబుతూనే ఆత్మకూరులో పోటీ చేస్తామని చెబుతూండడం విశేషంగా చూడాలి.

దీని మీద మిత్ర పక్షంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సింది ఉండగా కమలం పార్టీ వారు ఏకపక్షంగా డెసిషన్స్ తీసుకోవడం పట్ల జనసేన గుస్సా అవుతోంది. ఏది ఏమైనా బీజేపీ జనసేనల మధ్య ఏపీ వరకూ చూస్తే గ్యాప్ ఉందా లేక ఉండాలని చూస్తున్నారా అన్నదే అర్ధం కాని విషయం అని అంటున్నారు. మొత్తానికి జనసేన బీజేపీ మిత్రుడు ఏకపక్ష నిర్ణయం పట్ల ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News