ప్రధాని నరేంద్రమోడీ సహా కేంద్రమంత్రులంతా ఈ కరోనా వ్యాక్సినేషన్ లో తొలిరోజే పాల్గొని టీకాలు వేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు పోగొట్టాలనే ఇలా చేశారు. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లకు పైగా ఉన్న దీర్ఘాకాలిక రోగులకు ఈ దఫా టీకాలు వేస్తున్నారు.
తాజాగా మోడీ బాటలో రాష్ట్రంలోని పలువురు రాజకీయ నాయకులు, అర్హులైన వారు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కర్నూలులో కరోనా టీకా వేయించుకున్నారు. వీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయనకు కోవాగ్జిన్ టీకా ఇచ్చారు వైద్యులు. ఇదీ దేశీయ వ్యాక్సిన్ కావడం విశేషం.
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ప్రధాని మోడీ సైతం ఇదే స్వదేశీ వ్యాక్సిన్ వేసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోము వీర్రాజు కర్నూలులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు. దేశవ్యాప్తంగా అందరూ కరోనా టీకాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. కరోనా ముక్త భారత్ కోసం తాను ప్రజలందరూ టీకాలు వేసుకోవాలని పిలుపునిచ్చారు.