ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట

Update: 2022-01-15 07:30 GMT
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పెద్ద జోక్ పేల్చారు. అదేమిటంటే ప్రభుత్వంపై యుద్ధం చేస్తారట. ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను మానుకోకపోతే ప్రభుత్వంపై యుద్ధం చేయటానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులాగే పదే పదే ఒకటే మాటను వినిపిస్తున్నారు.

ప్రభుత్వం అనుసరించిన హిందూ వ్యతిరేక విధానాలు ఏమిటో చెప్పమంటే మాత్రం దిక్కులు చూస్తారు. హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాన్ని ప్రస్తావిస్తారు. దేవాలయాలపై దాడులు, రథాలు తగలబెట్టడం, విగ్రహాల ధ్వంసం నిజంగా దురదృష్టకర ఘటనలే అనటంలో సందేహం లేదు. అయితే వీర్రాజు చెప్పేదెలాగుందంటే అవన్నీ ప్రభుత్వమే చేయించిందనో లేకపోతే వైసీపీ నేతలే చేయించారన్నట్లుగా ఉంది.

జరిగిన ఘటనలకు ఎవరు కారణమన్న విషయం ఇంతవరకు తేలలేదు. శ్రీకాకుళం, రాజమండ్రిలో జరిగిన  రెండు మూడు ఘటనల వెనుక టీడీపీ నేతల హస్తముందని తేలింది. ఇక అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతు కేంద్రానికి లేఖ  రాసింది. ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇవి కాకుండా మత మార్పిళ్ళు జరుగుతున్నాయంటు నానా గోల చేస్తున్నారు. ఏ ఊరిలో బలవంతంగా మత మార్పిళ్ళు జరిగాయో చెప్పమంటే మళ్ళీ నోరెత్తటం లేదు.

హిందువులపై దాడులు, మత మార్పిళ్ళు అంటు గుడ్డ కాల్చి ప్రభుత్వంపై విసిరేయటం బాగా అలవాటైంది. చూడబోతే పార్టీ బలోపేతం అయ్యే అవకాశం లేదని వీర్రాజుకు అర్ధమైపోయినట్లుంది. అందుకనే మత రాజకీయాలనే నమ్ముకున్నట్లున్నారు. ఉత్తరాధిలో మతం మత్తును ఎక్కించి జనాలను ఎలా మాయచేశారో రాష్ట్రంలో కూడా అదే పద్దతిలో రాజకీయాలు చేయాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే పదే పదే హిందువులని, మతాలంటు వీర్రాజు గోల చేస్తున్నారు. మరి నమ్ముకున్న మత రాజకీయాలు గట్టెక్కిస్తాయేమో చూడాలి.
Tags:    

Similar News