అదేంటండీ... కొడుక్కు జైలు శిక్ష పడితే - బోరున విలపించాల్సిన తల్లి సంతోషపడుతోందా? కొడుక్కు జైలు శిక్ష పడేలా చేయడంలో తాను విజయం సాధించానని ఆ తల్లి గర్వ పడుతోందా? కన్న పేగు జైలు కెళితే... తల్లి సంతోషంగా ఉందని - అందులో తప్పేమీ లేదని చెబుతారా?... ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... కొడుక్కు జైలు శిక్ష పడితే ఆ తల్లి సంతోషపడుతున్న విషయం నిజమే. ఈ విషయంలో తల్లి తప్పేమీ లేదని - కొడుకుకు శిక్ష పడటం న్యాయమేనని చెప్పడంలోనూ ఎలాంటి సందేహం లేదు. అదెలాగంటే... సికింద్రాబాద్ పరిధిలోని నేరెడ్ మెట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు వింటే... ఈ వాదనను మీరు కూడా ఒప్పుకుని తీరతారు. మరింకెందుకు ఆలస్యం... ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
నేరెడ్ మెట్ కు చెందిన అమృత్ రావు - ప్రేమకుమారి దంపతులకు ఇద్దరు కొడుకులు - ఓ కుమార్తె ఉన్నారు. ప్రేమ కుమారి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారట. 2013లో భర్తను కోల్పోయిన ప్రేమ కుమారి కొడుకులను తన వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో తన కష్టార్జితంలో నిర్మించుకున్న ఇంటికి పట్టా ఇస్తామని అధికారులు రాగా... విషయాన్ని పెద్ద కొడుకు అమిత్ కుమార్ కు చెప్పిందట. తల్లి ఆస్తిపై దురాశ పెంచుకున్న అమిత్ తల్లికి తెలియకుండానే వ్యవహారం నడిపాడు. ఇంటిని తన తల్లి పేరు మీద కాకుండా తన భార్య లావణ్య పేరిట రిజిష్టర్ చేయించాడు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు విచారణకు రాగా... ఈ విషయం తెలుసుకున్న ప్రేమకుమారి ఇదేంటని ప్రశ్నించిందట. అంతేకాకుండా విచారణకు వచ్చిన రెవెన్యూ బృందంలో తన శిష్యురాలు ఉండటంతో కాస్తంత ధైర్యం తెచ్చుకున్న ప్రేమ కుమారి... 2015లో పెద్ద కొడుకు - అతడి భార్యపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నాలుగేళ్ల పాటు విచారణ సాగగా... ఇటీవలే ప్రేమకుమారికి అనుకూలంగా తీర్పు రావడంతో పాటుగా అమిత్ - లావణ్యకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మల్కాజిగిరీ కోర్టు తీర్పు చెప్పింది.
కొడుక్కి జైలు శిక్ష పడితే దు:ఖించాల్సిన ప్రేమకుమారి న్యాయ పోరాటంలో తనదే గెలుపు వరించిందని - దేవుడి దయ వల్లే ఇది సాధ్యమైందంటూ హర్షం వ్యక్తం చేశారు. అయినా అమిత్ కు శిక్ష పడితే ప్రేమకుమారి ఎందుకు సంతోషపడ్డారన్న విషయానికి వస్తే... తల్లి ఆస్తిని ఆమెకు తెలియకుండా భార్య పేరిట రిజిష్టర్ చేయించుకున్న అమిత్ - ప్రేమకుమారికి విషయం తెలియడం - న్యాయ పోరాటానికి దిగడంతో నిత్యం నరకం చూపించాడట. తన భార్య పేరిట ఉన్న ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందేనని ప్రేమకుమారిని వేధించాడట. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ప్రేమ కుమారి కొడుకు వేధింపులతో తీవ్ర మానసిక క్షోభను అనుభవించారట. ఈ క్రమంలోనే కొడుక్కి జైలు శిక్ష పడిందని తెలియగానే... ప్రేమ కుమారి ఏమాత్రం బాధ పడకుండా కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిందట. మరి కన్న తల్లిని మోసం చేసిన కొడుక్కి జైలు శిక్ష పడటం న్యాయమే కదా. ఆ తీర్పును ఆ తల్లి స్వాగతించడంలో తప్పేమీ లేదు కదా.