ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన ప్రతిస్పందనను ఎదుర్కునే అవకాశం ఉంది. ఫలితాల విడుదల రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్యంతో విదేశాల్లో చికిత్స పొందనున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ భవితవ్యాన్ని ఈ ఐదు రాష్ర్టాల ఫలితాలు తేల్చనున్నాయని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ - పంజాబ్ - ఉత్తరాఖండ్ - మణిపూర్ - గోవా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ 11వ(శనివారం) తేదీన వెల్లడికానున్నాయి. కాగా కౌంటింగ్ రోజున ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశంలో అందుబాటులో ఉండటం లేదు. అనారోగ్యం కారణంగా వైద్య పరీక్షలు - చికిత్స నిమిత్తం సోనియాగాంధీ గడిచిన మంగళవారం నాడే విదేశాలకు బయల్దేరి వెళ్లారు. ఆరోజు కూడా చికిత్స కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన తిరిగి రానున్నట్లు సమాచారం.
ఎన్నికల ప్రచారంలో వారణాసి రోడ్ షోలో పాల్గొన్న సోనియా అనారోగ్యానికి గురయ్యారు. ఢిల్లీలో చికిత్స తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలకు కూడా ఆమె సరిగ్గా హాజరుకావడం లేదు. అనారోగ్యానికి గురైన ఆమె గతంలో అమెరికాలో చికిత్స తీసుకున్నారు. కాగా ప్రస్తుతం యూకే వెళ్లినట్లుగా సమాచారం. సోనియా తరపున ఆమె కుమారుడు - ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఎంపీలతో రాహుల్ రేపు సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం. 11న వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూస్తే రాహుల్ నాయకత్వంపై మరొక్కమారు ప్రశ్నలు తలెత్తనున్నాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పురోభివృద్ధికి ప్రియాంకగాంధీ క్రీయాశీలకం కానున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/