కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఊహించని ఘటన.. అసలు కలలోకూడా అనుకోని సంఘటన.. రెండు గంటలవ్యవధిలో ఈడీ అధికారులు ఆమెపై 28 ప్రశ్నలను సంధించారు. ఒక్కొక్క ప్రశ్నకు సమాధానాన్ని 4 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారు. దీంతో సోనియా ఉక్కిరిబిక్కిరికి గురయ్యారనేది కాంగ్రెస్ నేతల మాట. తాజాగా ఈడీ ముందుకు హాజరైన సోనియా.. వారి నుంచి తీవ్రస్థాయిలో ప్రశ్నలను ఎదుర్కొనాల్సి వచ్చింది.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై సోనియాను ఈడీ ప్రశ్నించ నుంది. సోనియాకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. మరోవైపు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మహిళా కార్యకర్తలు నల్ల బెలూన్లు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈడీ అధికార దుర్వియోగాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు బీజేపీ నేతలు భయపడే ఈడీని పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఓసారి ఈడీ సోనియాను విచారించింది. ఈనెల 21న జరిగిన విచారణలో సోనియాను ఈడీ సుమారు 25 ప్రశ్నలు అడిగింది. అయితే సోనియా చేసిన విజ్ఞప్తి కారణంగా విచారణను రెండు గంటల్లో ముగించింది.
పార్టీ అధినేత్రి విచారణ నేపథ్యంలో ఆ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. పలు చోట్ల నిరసనలు ఉద్ధృతంగా మారాయి. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ ఎంపీలను నిర్బంధించారు. దాదాపు 75 మంది కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ కేసు..
కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేం దుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు.
కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించా రు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది. అదేవిధంగా రాహుల్‌గాంధీని కూడా విచారించింది.