టీమ్ ఇండియా క్రికెట్ కు సంబంధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకరు. అభిమానులు దాదా అని ఆయనను ముద్దుగా పిలుచుకుంటారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్సమెన్ గా గంగూలీ కొట్టిన లాఫ్టెడ్ సిక్సులకు అభిమానులు ఎంతోమంది ఉన్నారు. 2003 వరల్డ్ కప్ వన్డే ఫైనల్ దాకా జట్టును తీసుకెళ్లడంతోపాటు ఇంగ్లండ్ లో జరిగిన నాట్ వెస్ట్ ట్రోఫీ, చాంపియన్స్ ట్రోఫీల్లో విజేతగా భారత్ ను నిలిపాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక గంగూలీని రాజకీయాల్లోకి తీసుకురావాలని పలు పార్టీలు ఆఫర్లు ఇచ్చినా ఆయన ఎందుకో మొగ్గుచూపలేదు.
గంగూలీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీతోపాటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీ ఆయనను తమ పార్టీల్లోకి ఆహ్వానించినా గంగూలీ వెళ్లలేదు.
అయితే క్రికెట్ కు విరామం ప్రకటించాక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్షుడిగా గంగూలీ పనిచేశాడు.
కాగా ఎట్టకేలకు సౌరవ్ గంగూలీ.. ఈశాన్య రాష్ట్రం త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు. ఈ మేరకు త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌధరీ కోల్ కతాలోని గంగూలీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
అటు సీఎం మాణిక్ సాహా కూడా గంగూలీతో ఫోన్‌లో మాట్లాడి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరారు. దీనికి గంగూలీ అంగీకరించాడు. దీంతో ఆయనను త్రిపుర టూరిజం అంబాసిడర్ గా నియమిస్తూ త్రిపుర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తమ ప్రతిపాదనను అంగీకరించి త్రిపుర టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలు చేపడుతుండటం తమకు ఎంతో గర్వకారణమని త్రిపుర ప్రభుత్వం పేర్కొంది. గంగూలీ రాకతో తమ రాష్ట్ర పర్యాటక రంగం మరింత వెలుగొందుతుంది అని త్రిపుర సీఎం మాణిక్ సాహా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా ఈ పదవితో దాదా రాజకీయ అరంగేట్రంపై మరోసారి చర్చ జరుగుతోంది. త్రిపురలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో బీజేపీలో గంగూలీ చేరికకు మార్గం సుగమమైనట్టేనని భావిస్తున్నారు.
2024లో పశ్చిమ బెంగాల్ లో అత్యధిక సీట్లను కొల్లగొట్టడానికి సౌరవ్ గంగూలీని వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని టాక్. ఆ రాష్ట్రంలో 42 లోక్ సభ సీట్లు ఉండటమే ఇందుకు కారణం. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత అత్యధిక స్థానాలు ఉంది పశ్చిమ బెంగాల్ లోనే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్ గా గంగూలీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్త రాగానే.. పశ్చిమ బెంగాల్ లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం గమనార్హం. దీంతో దాదా బీజేపీలో చేరుతారని మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.
కాగా 2021లో గంగూలీ అనారోగ్యానికి గురైనప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. అయితే, అనుకున్నట్లుగా అప్పుడు ఆయన బీజేపీలో చేరలేదు.
గతేడాది బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ముగిసినప్పుడు దాన్ని మరోసారి పొడిగించలేదు. దీంతో బీజేపీలో చేరలేదన్న కక్షతోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించలేదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది.
ఈ నేపథ్యంలో గంగూలీ.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వచ్చాయి. గతేడాది గంగూలీ.. మమతా బెనర్జీతో సమావేశమవ్వడం, దుర్గాపూజకు వారసత్వ హోదా రావడంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయనను ముఖ్య అతిథిగా దీదీ ప్రభుత్వం ఆహ్వానించడం.. వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గంగూలీకి జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించడంతో టీఎంసీలో ఆయన చేరిక లాంఛనమే అనుకున్నారు. అయితే ఇంతలోనే బీజేపీ అధికారంలో ఉన్న త్రిపుర పర్యాటక శాఖకు ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.