స‌ఫారీల‌ను స్పిన్ తో స‌ఫా చేసేశారు

Update: 2015-11-26 08:49 GMT
భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ద‌క్షిణాఫ్రికా క్రికెట్ జ‌ట్టుకు ఊహించ‌ని షాకులు ఎదుర‌వుతున్నాయి. టీ20.. వ‌న్డేల‌లో తిరుగులేని అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించిన జ‌ట్టు.. టెస్టుల విష‌యానికి వ‌స్తే చ‌తికిల ప‌డుతున్నారు. ఊహించ‌ని విధంగా వారు విఫ‌ల‌మ‌వుతున్నారు. మొద‌టి టెస్ట్ లో ఘోర ఓట‌మి అనంత‌రం.. రెండో టెస్ట్ వ‌ర్షార్ప‌ణం కాగా.. తాజాగా మూడో టెస్ట్ జ‌రుగుతోంది. నాగ‌పూర్‌ లో జ‌రుగుతున్న ఈ టెస్ట్ లో టీమిండియా త‌న తొలి ఇన్నింగ్స్ ను త‌క్కువ స్కోర్ కే ముగించింది. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన స‌ఫారీలు రెండెంక‌ల స్కోర్ కే చేతులెత్తేయ‌టం గ‌మ‌నార్హాం.

భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్ లో 215 ప‌రుగులు చేసి అలౌట్ అయ్యింది. అనంత‌రం బ్యాటింగ్ ప్రారంభించిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు బుధ‌వారం రెండు వికెట్ల న‌ష్టానికి 11 ప‌రుగులు చేసింది. గురువారం రెండోరోజు ఆట‌ను ప్రారంభించిన స‌ఫారీలు ఓవ‌ర్ నైట్ స్కోర్‌ కు కేవ‌లం 68 ప‌రుగులు జోడించి అలౌట్ అయ్యారు. దీంతో.. 79 ప‌రుగుల‌కే స‌ఫారీల తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భార‌త్ మీద స‌ఫారీలు చేసిన అత్య‌ల్ప స్కోర్ ఇదే కావ‌టం విశేషం. తొలి ఇన్నింగ్స్‌ లో డుమిని చేసిన 35 ప‌రుగులే టాప్ స్కోర్ కావ‌టం చూస్తే.. ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు ప‌రుగులు తీయ‌టానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డారో ఇట్టే తెలుస్తుంది.  హార్మ‌ర్ (13).. డూప్లెసిస్ (10) ప‌రుగులు చేయ‌గా.. డివిలియ‌ర్స్‌.. వాన్ జిల్ ప‌రుగులేమీ చేయ‌కుండానే వెను తిరిగారు. మిగిలిన వారి స్కోర్ సింగిల్ డిజిట్ దాట‌క‌పోవ‌టంతో స‌ఫారీలో అత్య‌ల్ప స్కోర్ కే అలౌట్ అయ్యింది.

ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్ లైన్ ను క‌కావిక‌లం చేయ‌టంలో స్పిన్న‌ర్లు కీల‌క‌భూమిక పోషించారు. టీమిండియాలో అశ్విన్ ఐదు వికెట్లు.. జ‌డేజా 4 వికెట్లు ప‌డ‌గొ్ట్ట‌గా.. అమిత్ మిశ్రా ఒక వికెట్ ద‌క్కించుకున్నారు. తొలిఇన్నింగ్స్ లో 136 ప‌రుగుల అధిక్యాన్ని చేజిక్కించుకున్న భార‌త్‌.. త‌న రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ లో 200 నుంచి 250 ప‌రుగులు చేసినా.. స‌ఫారీల‌పై భార‌త్ సునాయాస విజ‌యం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News