బాబును ఆయ‌న అంత పొగిడేశార‌ట‌

Update: 2016-10-28 05:18 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు పొగ‌డ్త‌లంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పైగా అది త‌న ప‌రిపాల‌న గురించి అయితే బాబుగారి సంతోషానికి ప‌ట్ట‌పగ్గాలు ఉండ‌వు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సులేట్ జనరల్ క్యుంగ్సూ కిమ్ దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. 'మా దేశపు వృద్ధి రేటు 2 శాతం మాత్రమే ఉండ‌గా..రాష్ట్ర విభజన తరువాత సవాళ్లను ఎదుర్కొంటూ కూడా ఆంధ్రప్రదేశ్ 10.99 వృద్ధి రేటు సాధించడం - ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో దేశంలో రెండో స్థానంలో ఉండటం అపూర్వమన్నారు. ‘పనిలో మీ వేగానికి - మా వేగానికి లంకె కుదురుతుంది.  ఇంత వేగంగా స్పందించి, పనిచేసే మీలాంటి నాయకుణ్ణి ఎక్కడా చూడలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. చంద్రబాబు ఈజ్ ఎ చార్మింగ్ సిఎం’ అంటూ కిమ్ ప్రశంసల జల్లు కురిపించారని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న తెలిపింది.

ఈ సంద‌ర్భంగా కొరియా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ  రాష్ట్రంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పాలని కోరారు. రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా, కొరియాలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులే దర్శనమిస్తాయని - కొరియాతో రాష్ట్రానికి ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. రాజధాని అమరావతిలో కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని స్థాపించాలని కోరారు. ఏపీలో ఉత్పాదక యూనిట్లను స్థాపించాలన్న ఆసక్తి తమకు ఉందని కొరియా పారిశ్రామిక వేత్త‌లు తెలిపిన‌ట్లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న తెలిపింది. త్వరలో తమ దేశ ప్రతినిధులు వచ్చి అవకాశాలను పరిశీలిస్తారని, తదుపరి త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కిమ్‌ ను దక్షిణ కొరియా సంప్రదాయ జ్ఞాపికతో సత్కరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News