దేశంలోని అత్యంత ఖరీదైన ప్రాంతానికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది అన్ రాక్ సంస్థ. స్థిరాస్తి సలహా సంస్థగా పేరున్న ఈ కంపెనీ తాజాగా జరిపిన అధ్యయనంలో దేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల గురించి అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని తార్ దేవ్ రోడ్ దేశంలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతంగా వెల్లడించింది. ఈ ప్రాంతంలో చదరపు అడుగు స్థలం ధర అక్షరాల రూ.56,200 గా పేర్కొంది. ఈ ప్రాంతంలో విలాసవంతమైన భవనాలు.. ఉన్నత ప్రమాణాలున్న పెద్ద ఆసుపత్రులు.. హోటళ్లు ఉన్నట్లుగా వెల్లడించింది. ఈ కారణంతోనే ఈ ప్రాంతానికి ధర ఎక్కువగా ఉందని చెప్పింది.
ప్రైమరీ మార్కెట్ కు సంబంధించి మాత్రమే తాము అధ్యయనం చేశామని.. సెకండరీ మార్కెట్ ను తాము పరిగణలోకి తీసుకోలేదని చెప్పింది. తాజా అధ్యనం ప్రకారం తొలి పది ర్యాంకుల్లో మొదటి మూడు ర్యాంకు ముంబయి మహానగరానికి చెంది ఉండగా.. తర్వాతి రెండు స్థానాల్లో చెన్నై నిలిచింది. ఆసక్తికరంగా బెంగళూరు.. హైదరాబాద్ లకు ఒక్క స్థానం దక్కలేదు.
ఈ సంస్థ ఇచ్చిన తాజా ర్యాంకుల ప్రకారం చూస్తే..
నగరం ప్రాంతం చదరపు అడుగు ధర
1. ముంబయి తార్ దేవ్ రోడ్ రూ.56,200
2. ముంబయి వర్లి రూ.41,500
3. ముంబయి మహాలక్ష్మి రూ.40,000
4. చెన్నై నుంగంబాక్కం రూ.18,000
5. చెన్నై ఎగ్మోర్ రూ.15,100
6. ఢిల్లీ కరోల్ బాగ్ రూ.13,500
7. చెన్నై అన్నానగర్ రూ.13,000
8. ఫుణె కోరేగాం పార్క్ రూ.12,500
9. గుడ్ గాం గోల్ఫ్ కోర్స్ రోడ్ రూ.12,500
10. కోల్ కతా అలీపుర్ రూ.11,800