సర్పంచ్‌ గా స్పీకర్ భార్య ఘన విజయం..నాటి ఓటమికి ప్రతీకారం!

Update: 2021-02-18 05:37 GMT
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి సర్పంచ్‌ గా గెలుపొందారు. స్పీకర్ తమ్మినేని స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం తొగరాం పంచాయతీ ఎన్నికల్లో తమ్మినేని వాణి బంపర్ మెజారిటీతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 1,118 ఓట్లు పోల్ కాగా, వాణికి 808 ఓట్లు సాధించారు. అంటే, తమ్మినేని వాణి భారీ స్థాయిలో 72.22 శాతం ఓట్లు పొందారు. దీంతో మొత్తంగా 510 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఇదిలా ఉంటే .. శ్రీకాకుళం జిల్లా అముదాలవలస మండలం తొగరాం పంచాయతీ సర్పంచ్ ఎన్నికపై  ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం భార్య వాణీ సీతారం పోటీ చేయడం ఓ ఎత్తు అయితే , అయితే ఆమె పోటీ చేస్తున్నది  తోడి కోడలు పైనే కావడంతో రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారింది. శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భార్య వాణీ సీతారాం వైసీసీ మద్దతుతో బరిలోదిగితే. టీడీపీ మద్దతుతో తమ్మినేని అన్నయ్య దివంగత శ్యామలరావు సతీమణి భారతమ్మ బరిలో నిలిచారు. తొగరాం స్పీకర్‌ సొంత గ్రామం కావడం.. ప్రత్యర్థి పార్టీ మద్దతుతో వదిన పోటీలో ఉండడం, ఆమె గతంలో ఎంపీపీగా మండలాన్నిఅభివృద్ధి చేశారనే పేరు ఉంది. దీనికి తోడు జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు, మాజీ విప్‌ కూన రవికుమార్‌ భారతమ్మ విజయం కోసం విశేషంగా కృషి చేయడంతో అందరీ ఫోకస్ దీనిపై పడింది. దీనితో ప్రచారం కూడా ఇద్దరూ పోటీ పడీ మరీ నిర్వహించారు.  ఇద్దరు కీలక నేతలు అక్కడే మాకం వేసి ఎప్పటికప్పుడు  గెలుపు కోసం వ్యూహాలు రచించారు.

గతంలో సీతారాం తల్లి ఇందుమతి ఎంపీటీసీగా పోటీ చేయగా భారతమ్మ చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా తన భార్య విజయం సాధిస్తేనే రాష్ట్ర స్థాయిలో తన పరువు నిలుస్తుందని ఆయన పట్టుదలగా పావులు కదిపారు. .10 రోజులుగా గ్రామంలోనే బసచేసి వ్యూహాలు రచించారు. మరోవైపు తన పట్టును నిలుపుకునేందుకు రవికుమార్‌ కూడా భారతమ్మ విజయానికి అవసరమైన కృషి చేశారు. అత్యంత ఆసక్తి పెంచిన ఈ ఎన్నికల్లో సీతారాం భార్య వాణి సీతారం విజయం సాధించారు.. ఆమె ప్రత్యర్థి భారతి పై 540 ఓట్ల తేడాతో గెలుపొందారు. అంతకుముందే ఈ పంచాయతీలో వార్డులన్నీ ఏకగ్రీవం చేసుకోగలిగారు స్పీకర్. గతంలో  స్పీకర్ తల్లి ఓటమికి , ఇప్పుడు పంచాయతీ ఎన్నికల ఫలితాలో ప్రతీకారం తీర్చుకోగలిగారు.
Tags:    

Similar News