ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ ను రెబల్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కలిశారు.జాతీయ పరిణామాలపై చర్చించారు.ఇదే సమయంలో భారత్ కిసాన్ యూనియన్ నాయకులు రాకేశ్ టికాయత్ తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.వీరందిరితో కలిసి భోజనం చేశాక పలు విషయాలు చర్చించారు.
దేశ రాజధానిలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఇప్పటికే పలువురు కీలక నేతలతో కలసి ప్రయాణిస్తున్నారు.ఇదే సందర్భంలో రెబల్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వచ్చి కేసీఆర్ ను కలిశారు కానీ వీరి భేటీ మాత్రం రాజకీయంగా ఏమంత ప్రాధాన్యంలో లేదు.కేవలం రాజ్య సభ సీటు కోసమే ఆయన ఇక్కడికి వచ్చి ఉంటారన్నది కొందరు చెబుతున్న మాట.ఇక సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ రోజు ప్రాణాలు తెగించి పోరాడిన వైనంపై మరోమారు ఉద్యమకారులను అభినందించారు.
ఇక ఈ భేటీలో ఆసక్తికర పరిణామాలే ఉన్నాయి.రాజ్య సభ టికెట్ కోసం ఇప్పటికే పలువురు నేతలను దువ్వుతున్న సుబ్రహ్మణ్య స్వామి పనిలో పనిగా కేసీఆర్ ను కలిసేందుకు వచ్చారని తెలుస్తోంది.గతంలో సొంత పార్టీ బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి జాతీయ స్థాయిలో పేరు మరియు గుర్తింపు తెచ్చుకున్న సుబ్రహ్మణ్య స్వామి తాజా పరిణామాల నేపథ్యంలోమరోసారి వార్తల్లో నిలిచారు.అయితే ఆయన సాయం కేసీఆర్ కు ఏ విధంగానూ ఉపయోగపడబోదని ఇంకొందరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు.