స్సైస్ జెట్ ఎయిర్ లైన్స్ పై ఆ సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ మండిపడ్డారు. ‘నో ఫ్రిల్స్ కారియర్’ పేరుతో ఆ సంస్థ...తమను తనీఖీ చేయడంపై వారు నిప్పులు చెరుగుతున్నారు. తనిఖీల పేరుతో భద్రతా సిబ్బంది తమను అసభ్యకర రీతిలో తాకుతున్నారని వారు ఆరోపించారు. తమపై వ్యక్తిగత తనిఖీలు చేపడుతున్నారని - తమ హ్యండ్ బాగ్ లోని శానిటరి ప్యాడ్స్ కూడా తొలగించాల్సిందిగా ఆదేశిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రయాణికుల భద్రత - సౌకర్యం కోసం తాము పనిచేస్తున్నామని, కానీ, తమ భద్రత - గౌరవాలకు భంగం కలుగుతోందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ సిబ్బంది తీరు అత్యాచారం - వేధింపుల తరహాలో ఉందని వారు మండిపడుతున్నారు.
ఆహారపదార్థాలు అమ్మేందుకు ప్రయాణికుల దగ్గర నుంచి ఎయిర్ హోస్టెస్ లు డబ్బులు తీసుకుంటున్నారనే అనుమానంతో స్పైస్ జెట్ కొద్దికాలంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విమానం డీబోర్డింగ్ అయిన తర్వాత...ఎయిర్ హోస్టెస్ లను భద్రతా సిబ్బంది చెక్ చేస్తున్నారు. తనిఖీలు అయ్యేవరకు బాత్ రూంలోకి కూడా వెళ్లకూడదని ఆ సంస్థ యాజమాన్యం ఆదేశించింది. దీంతో, ఎయిర్ హోస్టెస్ లు నిరసన తెలిపారు. దీంతో, ఎయిర్ హోస్టెస్ లతో అధికారులు గుర్గావ్ లోని ఆఫీసులో సమావేశమయ్యారు. ఆ సమావేశం వీడియో బయటకు లీక్ అయింది. ఈ విషయంపై ఎయిర్ హోస్టెస్ లు, మరికొందరు చర్చిస్తోన్న వీడియో చెన్నై ఎయిర్ పోర్టు ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది.