కాంగ్రెస్ డిప్యూటీ సీఎం ఆఫర్ చేసింది..బీజేపీ హ్యండిచ్చింది!

Update: 2019-08-28 04:54 GMT
కర్ణాటకలో యడియూరప్ప కేబినెట్లో ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడాన్ని కొంతమంది ప్రహసనంగా చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు ఈ విషయం గురించి ఘాటుగా స్పందిస్తున్నారు. కేవలం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికే ఇలాంటి ఎత్తుగడలు వేశారని వారు అంటున్నారు. అసంతృప్తులు తలెత్తకుండా ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించారని వారు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

ముగ్గురు డిప్యూటీ సీఎంలను నియమించి ప్రభుత్వం పడిపోకుండా చూసుకుంటున్నారని, అదే సమయంలో యడియూరప్ప కు చెక్ పెట్టేందుకే వారి నియామకం జరిగిందని ప్రత్యర్థులు అంటున్నారు. వారి సంగతలా ఉంటే.. భారతీయ జనతా పార్టీలో మాత్రం మంత్రి పదవుల పంపకం రచ్చ చల్లారినట్టుగా లేదు. ముగ్గురు  డిప్యూటీ సీఎంలు రెడీ అయినా..ఇంకా ఆ హోదా దక్కలేదనే వారు అగుపిస్తూ ఉన్నారు.

వారిలో ముఖ్యులు శ్రీరాములు. భారతీయ జనతా పార్టీ నంచి కాంగ్రెస్ వైపు వస్తే శ్రీరాములుకు డిప్యూటీ సీఎం ఇస్తామని డీకే శివకుమార ఓపెన్ ఆఫర్ ఇచ్చారంటారు. అసెంబ్లీలోనే  డీకేశి ఆ ఆఫర్ ఇచ్చారట. విశ్వాస పరీక్ష సమయంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు శివకుమార అన్ని ప్రయత్నాలూ చేశారు. అందులో భాగంగా శ్రీరాములుకు ఆ పదవిని ఆఫర్ చేశారట. అయితే శ్రీరాములు మాత్రం బీజేపీకే కట్టుబడ్డారు. కానీ ఇప్పుడు ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. వేరే ముగ్గురికి దక్కింది కానీ - శ్రీరాములుకు మాత్రం దక్కలేదు.

ఈ నేపథ్యంలో శ్రీరాములు అనుచరులు రోడ్డెక్కారు. ఆయనకు ఉపముఖ్యమంత్రి హోదా కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ముగ్గురికి డిప్యూటీ సీఎం హోదాలు కల్పించిన నేపథ్యంలో శ్రీరాములుకు ఇక ఛాన్స్ దక్కే అవకాశాలు లేనట్టే అని పరిశీలకులు అంటున్నారు.


Tags:    

Similar News