ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితి చేయిదాటిపోయింది. కష్టాలు, కన్నీళ్లు, భరించలేని ఆకలి, విద్యుత్ కొరతతో చీకట్లు చూసి ప్రజలు రోడ్డెక్కారు. ఏకంగా అధ్యక్ష భవనంపై దాడి చేశారు. ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్న ప్రజల్లో ఈ మేరకు ఆగ్రహం ఉగ్రరూపం దాల్చింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడి నివాసం మీదకే దండెత్తేలా చేసింది. పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టేలా చేసింది. ప్రభుత్వ బస్సులను తగుల బెట్టేలా చేసింది. పోలీసులపై రాళ్లు రువ్వారు.
కడుపు కాలిన ప్రజలు, చిన్నారులు, మహిళలు సైతం ఈ ఆందోళనలో పాలుపంచుకోవడం విశేషం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దేశభక్తి అంటే రాజకీయ నాయకులను గుడ్డిగా నమ్మడం కాదని.. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు గొంతెత్తడమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అధ్యక్షుడు తక్షణం తప్పుకోవాలంటూ డిమాండ్ చేశారు.
కరోనా కల్లోలంతోపాటు శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడి ప్రజలను అంధకారంలోకి నెట్టేశాయి. ఆ దేశ స్వతంత్ర్య చరిత్రలోనే తొలిసారిగా తీవ్ర సంక్షోభంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యవసర వస్తువులు కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం, చమురు, విద్యుత్ సంక్షోభంతో శ్రీలంక కుదేలవుతోంది.
దీంతో వేలాది మంది ప్రజలు వేరే ప్రాంతలకు వలసబాట పడుతున్నారు. నిరంతర విద్యుత్ కోతలు, పెరుగుతున్న నిత్యావసర ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ కొరతతో రాత్రివేళ స్ట్రీట్ లైట్లను కూడా ఆన్ చేయని పరిస్థితి నెలకొంది. ఇంధన కొరతతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. తినడానికి తిండి లేక..వంట చేసుకోవడానికి గ్యాస్ లేక.. ఇంట్లో ఉందామంటే కరెంట్ లేక నిత్యావసరాలను ఆకాశాన్ని అంటిన వేళ ప్రజలంతా ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.
చివరకు చీప్ గా దొరికే ఉప్పు కోసం కూడా ప్రజలు గంటల కొద్దీ క్యూలో నిలుచునేలా పరిస్థితి శ్రీలంకలో ఏర్పడింది. అలా గంటల తరబడి వేచి ఉన్నా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. శ్రీలంక ప్రభుత్వం చేసిన అప్పులే ఈ పరిస్థితికి కారణం. దీంతో వీటన్నింటిని ఇంతకాలం ఓపికగా భరించిన ప్రజలు ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకునేందుకు నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. నిరసన కారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు ప్రయోగించారు. ఆ తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. పోలీస్, ఆర్టీసీ వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. దీంతో దేశ రాజధాని కొలొంబోలో కర్ఫ్యూను విధించారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని ఏకంగా అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. కొలొంబోలోని అధ్యక్షుడు రాజపక్సే ఇంటి ఎదుట ప్రజలు ఆందోళనకు దిగారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్చేశారు. ఈ నిరసన హింసాత్మకంగా మారింది. పలువురు ప్రజలు,జర్నలిస్టులు గాయపడ్డారు.
శ్రీలంకలో దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది దేశం దాటికి భారత్ లోకి వస్తున్నారు. శ్రీలంకలో ఆదాయం లేక.. కొనేందుకు నిత్యావసరాలు భగ్గుమనడంతో భారత్ కు వలస వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కరోనాతో దెబ్బతిన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో మరింత పతాకస్థాయికి చేరింది.