శ్రీదేవికి ఎంబామింగ్ ఎందుకు చేశారు

Update: 2018-02-27 11:15 GMT
శ్రీదేవి మ‌ర‌ణంపై  మిస్ట‌రీ వీడిపోయింది. నాలుగురోజుల పాటు విచార‌ణ జ‌రిపిన ప్రాసిక్యూష‌న్ శ్రీదేవి భ‌ర్త బోనీకి క్లీట్ చిట్ ఇచ్చింది. ఫోరెన్సిక్ రిపోర్టుతో ఏకీభ‌వించిన ప్రాసిక్యూష‌న్ అతిలోక సుంద‌రి బాత్రూంలో ప‌డి చ‌నిపోయిన‌ట్లు తేల్చి చెప్పారు.  దీంతో శ్రీదేవి మ‌ర‌ణంపై  అనిశ్చితి తొల‌గిపోయింది. ఓ వైపు త‌న అభిమాని న‌టిని కోల్పోయామ‌నే బాధ. ఓ వైపు ఆమె మ‌ర‌ణానికి సంబంధించి దుబాయ్ అధికారులు లేవ‌నెత్తిన అనుమానాల‌తో ఎన్నో ఊహాగానాలు. ఎన్నో అనుమానాలు క్ష‌ణం క్ష‌ణం ఉత్కంఠ‌త‌నురేపాయి. ఆ ఉత్కంఠ‌త‌కు తెర‌దించుతూ దుబాయ్ ప్రాసిక్యూష‌న్ అధికారులు ఎంబామింగ్ కు అనుమ‌తిచ్చారు. దుబాయ్ అట‌ర్నీ జ‌ర్న‌ల్ శ్రీదేవి భౌతిక కాయాన్ని ఇండియాకు తీసుకు వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చారు.     

  శ్రీదేవి ప్ర‌మాద శాత్తూ మ‌ర‌ణించారా..?  లేదంటే ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా అనే కోణంలో  జ‌రిగిన నాలుగు రోజుల విచార‌ణ ఎట్ట‌కేల‌కు ముగిసింది.  ప్రాసిక్యూష‌న్ నుంచి క్లియ‌రెన్స్ రావ‌డంతో  శ్రీదేవి మృత‌దేహానికి దుబాయ్ డాక్ట‌ర్లు ఎంబామింగ్ చేస్తున్నారు.  ఎంబామింగ్ ప్ర‌క్రియ త‌రువాత శ్రీదేవి మృత‌దేహాన్ని బోనీ కుటుంబ‌స‌భ్యుల‌కు ఆమె మృత‌దేహాన్నిఅప్ప‌గిస్తారు.  సాయంత్రం ఐదుగంట‌ల‌కు దుబాయ్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేటు  విమానంలో శ్రీదేవి విమానాన్ని ముంబైకి త‌ర‌లిస్తారు. ఈ త‌ర‌లింపుతో ముంబైకి శ్రీదేవి మృత‌దేహం రావాడానికి  రాత్రి 10గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. ముంబై తీసుకు వ‌చ్చిన అనంత‌రం శ్రీదేవి భౌతిక కాయాన్ని అభిమానుల సంద‌ర్శ‌నానికి ఉంచి రేపు ఉద‌యం నుంచి త‌రువాత అంత్య‌క్రియ‌లు చేస్తారు.  .

అయితే ప్ర‌స్తుతం శ్రీదేవి డెడ్ బాడికి ఎంబామింగ్ జ‌రుగుతున్న‌త‌రుణంలో ఎంబామింగ్ అంటే ఏంటీ..? ఎంబామింగ్ ఎందుకు చేస్తారు. అనే విష‌యాల్ని తెలుసుకుందాం.  సాధార‌ణంగా చ‌నిపోయిన వ్య‌క్తి మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తారు. కొన్నిసార్లు అంత్య‌క్రియులు వేచి చూడాల్సి వ‌స్తుంది. శ్రీదేవి మ‌ర‌ణం విష‌యంలో ప్ర‌స్తుతం అలాగే జ‌రుగుతుంది.

శ్రీదేవి మ‌రణించిన త‌రువాత ఆమె బౌతిక కాయానికి అంత్య‌క్రియ‌లు చేయ‌కుండా అలాగే మార్చురీలో ఉంచారు. మ‌రి మార్చురీలో ఉన్న మృత‌దేహం చెడిపోదా అనే అనుమానం రావ‌చ్చు. బాక్సులో ఐస్ ముక్క‌ల్ని ఉంచి భ‌ద్ర‌ప‌రుస్తారు. అనంత‌రం మృదేహానికి అంత్య‌క్రియ‌లు చేయాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు బాడీకి ఎంబామింగ్ చేస్తారు.  ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా  శ్రీదేవి మృత‌దేహానికి ఫార్మాల్డిహైడ్ - మెథ‌నాల్ - ఇథాన‌ల్ తో పాటు కొన్ని రసాయ‌నాల్ని ధ‌మ‌నుల ద్వారా శ‌రీరంలోకి ఎక్కిస్తారు. ఈ ఎంబామింగ్ ప్ర‌క్రియలో బుగ్గలు బాగా లోపలికి వెళ్తే.. మైనపు పూతపూసి ఉబ్బినట్లు చేస్తారు. చాలారోజులపాటు అస్వస్థతకు గురైనవారి కనుగుడ్లు పీక్కుపోయి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ కనుగుడ్లను సహజంగా అమర్చుతారు. శరీరంపై పడిన  ముడతలను తొలగిస్తారు. దీంతో మృత‌దేహం సాధార‌ణ స్ధితికి వ‌స్తుంది.

ఈ ఎంబామింగ్ ప‌ద్ద‌తిని పాటించ‌డంలో అమెరికా ముందున్న‌ట్లు కొన్ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎంబామింగ్ కు ఉప‌యోగించే కెమిక‌ల్స్ అమెరికాలో ప్ర‌తీ సంవ‌త్స‌రం 2కోట్ల ట‌న్నుల్ని వినియోగిస్తున్నార‌ని తెలుస్తోంది
Tags:    

Similar News