''క్రికెట్ విచిత్రమైనది.. ఎవరిని హీరోలను చేస్తుందో..? ఎవరిని జీరోలను చేస్తుందో? చెప్పలేం''ఓ వ్యక్తి ఈ మాటలను పదేపదే చెబుతుంటారు. అంతమాత్రాన ఆయనేదో సామాన్య వ్యక్తి కాదు. పేరు తలుచుకుంటే ప్యాంట్లు తడిసిపోయే.. ప్రపంచంలోనే భీకర ఫాస్ట్ బౌలర్లను కనీసం హెల్మెట్ కూడా లేకుండా ఎదుర్కొని వేలకొద్దీ పరుగులు చేసిన దిగ్గజ బ్యాట్స్ మన్ సునీల్ గావస్కర్. అవును.. క్రికెట్ విచిత్రమైనదే. ఎందుకంటే ఒక మ్యాచ్ లో హీరో.. మరో మ్యాచ్ కు వచ్చేసరికి జీరో అవచ్చు. ఇప్పుడు ఆధిపత్యం చాటిన జట్టు.. రేపు పతనం కావొచ్చు. దీనికి మరింత బలమైన ఉదాహరణ.. శ్రీలంక.
అనామకం.. చాంపియన్.. అనామకం..
శ్రీలంక గురించి చెప్పాలంటే.. అంతర్జాతీయ క్రికెట్ లో ఆ జట్టు ఐదు దశాబ్దాల ప్రయాణం. కానీ, 1996 ముందు వరకు ఆ జట్టు ద్వితీయ శ్రేణి జట్టే. అయితే, ఉప ఖండంలో నిర్వహించిన 1996 ప్రపంచ కప్ తో లంక రాత మారిపోయింది. నాటి కప్ లో అర్జున రణతుంగా సారథ్యంలో విజేతగా నిలవడంతో శ్రీలంక అగ్రశ్రేణి జట్టుగా ఎదిగింది. అక్కడినుంచి ఓ ఐదేళ్లు లంకతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లు ఓటమిని తలుచుకునేవి. శ్రీలంక ప్రభావం ఇలా దాదాపు రెండు దశాబ్డాలు కొనసాగింది. జయస్యూర, మహనామ, కలువితరణ, మురళీధరన్, జయవర్దనే, సంగక్కర, మలింగ, దిల్షాన్ ఇలా పదుల సంఖ్యలో నాణ్యమైన ఆటగాళ్లతో మేటి జట్టుగా ఎదిగింది. అయితే, వీరంతా ఒకరి వెంట ఒకరు రిటైర్ కావడంతో లంక జట్టు మళ్లీ వెనుకబడిపోయింది.
ఐదేళ్లుగా ప్రమాణాలు పతనం
2015 ప్రపంచ కప్ వరకు శ్రీలంక అగ్రశ్రేణి జట్టుగానే ఉంది. కానీ, జయవర్దనే, సంగక్కర, దిల్షాన్ తదితరుల రిటైర్మెంట్ తో క్రమంగా పట్టు కోల్పోయింది. దీనికితోడు క్రికెట్ బోర్డు రాజకీయాలు మరింత దెబ్బతీశాయి. ఓ దశలో బోర్డునే ఆటగాళ్లు ధిక్కరించే పరిస్థితి వచ్చింది. కొంతమంది క్రికెటర్లు కలుగజేసుకున్నా.. పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. ఈలోగా నాణ్యమైన ఆటగాళ్లు చేజారిపోయారు. రెండేళ్ల కిందటైతే లంక అసలు మళ్లీ పైకి లేస్తుందా? అన్న అనుమానాలు తలెత్తాయి.
రాజకీయ సంక్షోభంతో..
2 నెలల కిందట శ్రీలంకలో ఎంతటి రాజకీయం సంక్షోభం నెలకొందో అందరూ చూశారు. ఏకంగా దేశాధ్యక్షుడే పారిపోయారు. దీనికితోడు ఆర్థికంగా శ్రీలంక దివాలా తీసింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్ వాడకంపై నియంత్రణ విధించాల్సిన పరిస్థితి. ఏకంగా ఓ క్రికెటరే పెట్రోల్ కోసం క్యూలో నిల్చున్న వైనం. అయితే, ఇవన్నీ ముదిరి ప్రజలు తిరుగుబాటు చేశారు. అధ్యక్షుడి భవనంలోకి చొరబడ్డారు. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ దేశంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేకపోయింది.
ఆసియా కప్ అక్కడ జరగాల్సిందే..
ప్రస్తుతం దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్ వాస్తవానికి శ్రీలంకలో జరగాలి. కానీ, అక్కడి పరిస్థితుల రీత్యా వేదికను మార్చారు. అయితే, ఇక్కడో విషయం చెప్పాలి. అధికారికంగా మాత్రం ఆసియా కప్ వేదిక శ్రీలంక పేరే ఉంది. ఇక టోర్నీ తొలి మ్యాచ్ శ్రీలంక-అఫ్గానిస్థాన్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ లో లంక దారుణంగా ఓడిపోయింది. 105 పరుగులకే ఆలౌటైంది. 19.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. ఈ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 10.1 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. దీన్నిబట్టే లంక ఎంతటి ఘోరంగా ఓడిందో తెలుస్తోంది. కానీ, అదే జట్టు ఆదివారం ఫైనల్ ఆడుతోంది. లీగ్ దశలో మొదటి మ్యాచ్ ఓటమి తర్వాత గొప్పగా పుంజుకొన్న ఆ జట్టు బంగ్లాదేశ్ పై చివరి వరకు పోరాడి గెలిచింది. సూపర్ 4లో భారత్ నే ఓడించింది. మరికాసేపట్లో ఫైనల్ ఆడనుంది. దీనికిముందు సూపర్ 4లో పాకిస్థాన్ ను తేలిగ్గా ఓడించింది. ఫేవరెట్ గా ఫైనల్ ఆడబోతున్న లంక.. చాంపియన్ అయితే మరింత విశేషమే.