షాకింగ్‌ వీడియో.. ఏపీలో ఇస్త్రీ పెట్టెతో కాల్చి ఇంజనీరింగ్‌ విద్యార్థిపై దాడి!

Update: 2022-11-06 02:47 GMT
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో షాకింగ్‌ వీడియో వెలుగుచూసింది. రాష్ట్రంలోనే ప్రముఖ కాలేజీల్లో ఒకటిగా ఉన్న ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజీలో ఒక విద్యార్థిని ఇస్త్రీ పెట్టెతో కాల్చి పైపులతో కొట్టిన ఘటన కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన షాకింగ్‌ వీడియో వైరల్‌గా మారింది.

ప్రేమ విషయంలోనే ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థిని నలుగురు విద్యార్థులు ఇస్త్రీ పెట్టెతో కాల్చి చితకబాదారు. బాధిత విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. ఘటనకు సంబంధించి నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు విద్యార్థులను అరెస్టు చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే... అంకిత్, ప్రవీణ్, ప్రేమ్‌ కుమార్, స్వరూప్, నీరజ్‌ అనే ఐదుగురు విద్యార్థులు ఇంజనీరింగ్‌ సెకంyì యర్‌ చదువుతున్నారు. ఈ క్రమంలో ఒకమ్మాయి విషయంలో అంకిత్‌తో మిగిలిన నలుగురికి వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు.  


ఆ తర్వాత నలుగురు విద్యార్థులు అంకిత్‌ను సీవీసీ పైపులతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా ఇస్త్రీపెట్టెతో శరీరంపై పలు చోట్ల కాల్చారు. దీంతో అంకిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి.


విద్యార్థి తనను విడిచిపెట్టాలని వేడుకున్నా నలుగురు విద్యార్థులు అతడిని విచక్షణారహితంగా కొట్టారు. క్షమాపణలు చెప్పినా అతడిని విడిచిపెట్టలేదు. దీంతో అంకిత్‌ రక్షించాలని అరుపులు పెట్టాడు. అతడి చొక్కా తొలగించి పలుచోట్ల ఇస్త్రీ పెట్టెతో కాల్చారు. ఇవన్నీ వీడియోలో రికార్డు అయ్యాయి. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెండ్‌ చేశారు.

కాగా ఐదుగురు విద్యార్థులు ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ సెకండియర్‌ చదువుతున్నారు. వీరంతా ఒక ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్నారు.

బాధితుడు అంకిత్‌  గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. అతని ఛాతీ, చేతులపై కూడా కాలిన గాయాలు ఉన్నాయి.


Full View
Tags:    

Similar News