'వాటాలు' కుద‌ర‌లేదా.. పుట్టిన రోజు చ‌ప్ప‌బ‌డిందా?!

Update: 2022-12-21 09:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా సంబ‌రాలు చేయాల‌ని.. పార్టీ అధిష్టా నం నుంచి జిల్లాల‌కు ఆదేశాలు వ‌చ్చాయి. ఇవి వ‌చ్చి నాలుగు రోజులు అయింది. దీంతో నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ ర‌హ‌స్య స‌మావేశాలు నిర్వ‌హించుకున్నారు. మీరు ఇంత ఇవ్వండి.. మేం ఇంత ఇస్తాం..అని వాటాలు వేసుకున్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. మండ‌లాల వారీగా కార్య‌క్ర‌మాల‌కు ప్లాన్ చేసుకున్నారు.

అంటే.. మండ‌ల స్థాయిలో చేసేవారు.. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో చేసేవారు.. పంచాయ‌తీల స్థాయిలో పండుగ చేసేవారు.. ఇలా ఎవ‌రికి వారు వాటాలు వేసుకున్నారు. ఉద‌యం 11 -12 మధ్య‌లో ఆయా సంబ‌రాల‌ను పూర్తి చేసి.. వెంట‌నే.. ఆయా సంబ‌రాల తాలూకు ఫొటోలను వైసీపీ సోష‌ల్ మీడియా విభాగానికి పంపించాల‌ని కూడా ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు వైసీపీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది.

అస‌లే ఎన్నిక‌ల సీజ‌న్‌.. పైగా అధినేత ఎవ‌రిని క‌రుణిస్తారో.. ఎవ‌రిని భుజాన వేసుకుంటారో.. ఎవ‌రిని కింద ప‌డేస్తారో.. అనేది అత్యంత గోప్యంగా ఉంది. దీంతో నాయ‌కులు అంద‌రూ వాటాలు వేసుకుని..వేడుకలు చేసుకునేందుకు రెడీ అయ్యారు.

ఇక‌, ఇదేస‌మ‌యంలో ర‌క్త‌దానం.. అన్న‌దానం.. మొక్క‌లు నాట‌డం, అనాథ శ‌ర‌ణాల‌య్యాలో దుస్తుల పంప‌కం, వృద్ధాశ్ర‌మాల్లో పండ్ల పంప‌కం.. ఇలా ఒక‌టేమిటి.. అన్న‌ను సంతృప్తి ప‌రిచేందుకు స‌వాల‌క్ష పంప‌కాల‌ను ఎంచుకున్నారు.

తీరా.. సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు రానే వ‌చ్చింది. కానీ.. అనుకున్న విధంగా సంబ‌రాల ఉత్సాహం మాత్రం పెద్ద‌గా క‌నిపించ‌లేదు. జిల్లాల స్థాయిలో అయితే.. మ‌రింత దారుణంగా ఉందనేటాక్ వినిపిస్తోంది.

వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం.. ఈ వేడుక‌ల‌ను మానిట‌రింగ్ చేస్తోంది. ఉద‌యం 11 అయినా.. కూడా ఏ జిల్లా నుంచి ఒక్క ఫొటో కూడా కార్యాల‌యానికి చేర‌లేద‌ని స‌మాచారం. పోనీ.. ప్ర‌ధాన మీడియాలో అయినా.. అవి ప్రసారం అవుతున్నాయా? అంటే అది కూడా లేదు. మొత్తానికి.. ఎక్క‌డో తేడా కొట్టింద‌ని.. అందుకే పుట్టిన రోజు వేడుక‌లు చ‌ప్ప‌గా సాగుతున్నాయ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News