ముఖ్య‌మంత్రికి శ‌త్రువు స‌ల‌హా

Update: 2015-11-27 19:56 GMT
రాజ‌కీయ‌ల్లో సుహృద్భావ వాతావ‌ర‌ణం క‌నుమ‌రుగైపోయి చాలాకాలం అయింది. అన్ని రాష్ర్టాల్లోని రాజ‌కీయాలకు...త‌మిళ‌నాడులోని రాజ‌కీయాల‌కు స్ప‌ష్ట‌మైన తేడా ఉంటుంది. ఆ రాష్ర్టంలో ప్ర‌తిప‌క్షాలు అనేకంటే క‌క్షిదారులు అనే రేంజ్‌లో పాలిటిక్స్ సాగుతుంటాయి. అన్నాడీఎంకే-డీఎంకే మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి అక్క‌డ స‌ర్వ‌సాధార‌ణం అయింది. ఈ క్ర‌మంలో తాజాగా త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌కు ఊహించ‌ని స‌ల‌హా వ‌చ్చింది. అది కూడా ఆమె ప్ర‌త్య‌ర్థి పార్టీ డీఎంకే నుంచి, పైగా భ‌విష్య‌తులో సీఎం ప‌ద‌వికి పోటీ దారుడు అయిన డీఎంకే నేత‌ స్టాలిన్ నుంచి కావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం.

ఏప్రిల్‌ 1 నుంచి బీహార్‌లో మద్యం నిషేధిస్తామని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో జ‌య‌ల‌లిత‌కు స్టాలిన్ సూచ‌న చేశారు. "మధ్యనిషేధం విషయంలో బీహార్ సీఎం నితీశ్‌కుమార్ తీసుకున్న నిర్ణ‌యం చాలా సాహసోపేతమైంది. మద్యం బారిన పడి తమిళనాడులో పలు కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయి.  ప్రజలకోసం పనిచేయడం అంటే నితీశ్ లాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే. అందుకే తమిళనాడులోనూ నితీశ్ త‌ర‌హా నిర్ణయం తీసుకోవాలి" అని స్టాలిన్ డిమాండ్ చేశారు. తాము తమిళనాడులో మద్యం నిషేధించాలని ఎన్నోసార్లు కోరామ‌ని అయినా పట్టించుకోవడం లేదని స్టాలిన్ అన్నారు. నితీశ్‌ను అనుసరించి మద్యం నిషేధిస్తూ చట్టం తీసుకుని రావాలని, ఇది త‌మ‌ డిమాండ్‌ కాదని....ప్రజల డిమాండ్‌గా పరిగణించండంటూ తమిళనాడు సీఎం జయలలితకు డీఎంకె నేత స్టాలిన్‌ సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా బీహార్‌ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ గురువారం నితీశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపడితే రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధిస్తానన్న హామీని నితీశ్ కుమార్ విజ‌య‌వంతంగా నెర‌వేర్చారు.
Tags:    

Similar News