ట్రంప్ కు షాకిచ్చిన కాఫీ షాప్ ఓనర్

Update: 2017-01-31 05:32 GMT
అమెరికా అధ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఊహించని షాక్ ఎదురైంది. ఏడు ముస్లిం దేశాల వలసలను నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చినప్పటికీ తాము మాత్రం శరణార్థులకు ఉద్యోగాలిచ్చి తీరుతామని ప్ర‌ఖ్యాత కాఫీ విక్ర‌య కేంద్రాల సంస్థ‌ స్టార్‌ బక్స్ ప్రకటించింది. వచ్చే అయిదేళ్లలో పదివేల ఉద్యోగాలు ఇస్తామని పేర్కొంది. కాఫీ రిటైలర్స్ చైర్మన్ - సీఈఓ హోవర్డ్ షుల్జ్ మాట్లాడుతూ అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లలో ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిలో నియమిస్తామని స్పష్టం చేశారు. సిరియా, ఇరాక్‌ లలో అమెరికా సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచిన శరణార్థులకు అండగా నిలుస్తామని ఆయ‌న ప్ర‌క‌టించారు.

అధ్యక్ష ఎన్నికల సందర్భంలో హోవర్డ్ హిల్లరీ క్లింటన్‌ కు మద్దతుగా నిలిచారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెల్త్‌ కేర్ చట్టాన్ని రద్దు చేయటం, మెక్సికోతో వ్యాపార లావాదేవీలను పునర్వ్యవస్థీకరించటం, ఇప్పుడు ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలోకి రానివ్వకుండా నిషేధించటంపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మెక్సికోలో కాఫీ తోటల పెంపకందారులను స్టార్‌ బక్స్ సహాయం చేస్తుందని హోవర్డ్ స్పష్టం చేశారు. అర్హులైన కార్మికులకు ఆరోగ్యబీమా కల్పిస్తామని ఆయన ప్రకటించారు. తమ కంపెనీ ఉద్యోగులకు ఆయన ఇమెయిల్ ద్వారా స్పష్టమైన హామీ ఇచ్చారు. ‘ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపట్ల మీరంతా ఆందోళనగా ఉన్నారని తెలుసు. మానవ హక్కులపై జరుగుతున్న ఈ దాడిని మనం గట్టిగా ఎదుర్కొంటాం’ అని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News