మీ పిల్లలకు వ్యాక్సిన్ వేయిస్తున్నారా? దీన్ని మిస్ చేసుకోవద్దు

Update: 2022-01-03 07:32 GMT
ఈ రోజు నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో పాటు.. ప్రైవేటు సంస్థలు కూడా ఈ టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కొవిడ్ యాప్ లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వేయించుకోవాల్సి ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సెకండ్ వేవ్ కు కాస్త ముందుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైతే.. మూడో వేవ్ ప్రారంభంలో పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కావటం. మీ పిల్లలకు వ్యాక్సిన్ వేయించే సమయంలో తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం.. జాగ్రత్తగా చెక్ చేయాల్సిన అంశం ఒకటి ఉంది.

అదేమంటే.. పెద్దలకు వేసే వ్యాక్సిన్.. పిల్లలకు వేసే వ్యాక్సిన్ ఒకటి కాదు. వేర్వేరు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. పిల్లలకు వేసే వ్యాక్సిన్ పేరు ‘‘కొవ్యాక్సిన్’. మొదటి డోసు వేసుకున్న నెల రోజుల తర్వాత రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ.. పిల్లలకు వ్యాక్సిన్ వేసే వేళలో.. వారికి వేసే టీకా పిల్లలకు వేయాల్సిన ‘కొవ్యాక్సిన్’ అన్న విషయాన్ని గుర్తించి.. జాగ్రత్తగా చెక్ చేయాల్సి ఉంది.

కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సిబ్బంది చేసే పొరపాట్ల వల్ల పెద్ద వాళ్లకు వేయాల్సిన వ్యాక్సిన్ పిల్లలకు వేస్తే.. ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే.. పిల్లలకు వ్యాక్సిన్ వేయించే వేళలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. టీకాలు కలిసి పోకుండా ఉండేందుకు వీలుగా వేర్వేరు టీకా కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని చెబుతున్నారు.

కానీ.. అలాంటివి ఏర్పాటు చేయని పక్షంలో.. క్రాస్ చెక్ చేసుకోవటం ద్వారా.. అనవసర ప్రమాదంలోకి పడకుండా ఉండొచ్చు. సో.. పిల్లలకు వ్యాక్సిన్ వేళలో మరింత జాగ్రత్త అవసరమన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News