మూడు రాజధానులకు సంబంధించి గతంలో ప్రవేశ పెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఏపీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించిముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ముందుగా సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్ని ఆయన చదివి వినిపించారు. ఈ ప్రకటన గొప్పతనం గురించి ఇక్కడ ప్రస్తావించాలి. విన్నంతనే అర్థమైనట్లుగా ఉంటుంది. కానీ.. ఏం అర్థమైందని అడిగితే.. సమాధానం వెంటనే చెప్పలేని పరిస్థితి.
అసెంబ్లీలో జగన్ చేసిన ప్రకటన విన్నంతనే ఆయనేం చెప్పదలుచుకున్నారన్న విషయం అర్థమైతే ఒట్టు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటానికి ఆయన చెప్పిన కారణం అతికినట్లుగా లేదు. ఆ మాటకు వస్తే.. అసలు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకోవటానికి ప్రస్తావించిన విషయాల్లోనూ దారుణమైన తప్పులు చోటు చేసుకున్నాయి. అమరావతి విషయంలో 2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా తాను మూడురాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.
2019 ఎన్నికల ప్రచార వేళలో.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని పదే పదే చెప్పిన జగన్.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం చూస్తే.. తన మాటల్ని తాను ఖండించుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. వికేంద్రీకరణకు సంబంధించిన అనేక అపోహలు.. అనుమానాలు.. కోర్టు కేసులు.. న్యాయపరమైన వివాదాలు..దుష్ర్పచారాలు.. ఇలా రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారం చేశారన్న జగన్.. తాము విపక్షంలో ఉన్న వేళలో నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కోర్టుల్ని ఆశ్రయించలేదా? అన్న సందేహం రావటంతో పాటు.. మంగళగిరి ఎమ్మెల్యే చేసిన పలు న్యాయపోరాటాలు అప్రయత్నంగా కళ్ల ముందు కదలాడతాయి.
మూడు బిల్లుల్ని వెనక్కి తీసుకున్న వేళ.. దానికి కారణం చెప్పే క్రమంలో మరో కీలక విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా గానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు, ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు'గా చెప్పారు.
అంతేకాదు.. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని, మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తామని జగన్ చెప్పారు. ఇదంతా విన్న తర్వాత మదిలో మెదిలే సందేహం ఏమంటే.. మరి.. మూడు రాజధానుల బిల్లును అంత త్వరపడి.. సమగ్రంగా ఎందుకు తయారు చేయలేదు? తాము బిల్లును ప్రవేశ పెట్టిన వేళ.. దాన్ని వ్యతిరేకించే వారు ఏయే అంశాల్ని తెర మీదకు తీసుకొస్తారు? న్యాయస్థానాలు ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉందన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేదు? అన్నది కూడా ప్రశ్నే కదా?
ఇలా సీఎం జగన్ చేసిన ప్రకటనలోని అంశాల్ని చూసినప్పుడు.. ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పే కన్నా.. నర్మగర్భంగా.. అర్థమై కానట్లుగా చెప్పేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవటాన్ని ఆయన తన ఓటమిగా భావించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న మోడీ మాదిరి వ్యవసాయ చట్టాల విషయంలో ఎంత సూటిగా.. స్పష్టంగా చెప్పేశారో.. అదే రీతిలో చెప్పటంలో మాత్రం జగన్ ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.