వేసవికాలం ప్రారంభంలోని భానుడు భగభగమంటున్నాడు. ఇప్పటికే తన విశ్వరూపం చూపిస్తున్నాడు. మార్చి చివరి నుంచే 40 డిగ్రీల్లో ఉష్ఠోగ్రత నమోదవుతోంది. ఇంట్లో బయట ఉన్నా ఉక్కపోతగా ఉంటోంది. ఈ మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారపు అలవాట్లలోనూ స్వల్ప మార్పులు చేసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు.
శరీరానికి చలువ చేసే పదార్థాలతో పాటు షోషకాలిచ్చే పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కాయగూరల్లో నీరు ఎక్కువగా ఉండేవాటినే ఎంపిక చేసుకోవాలి. ఈ ఎండల్లో శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతుంది కాబట్టి నీరు ఎక్కువగా ఉండే పదార్ధాలను తీసుకోవాలి.
మాంసానికి కాస్త దూరంగా ఉండాలి. దీనిలో కొవ్వు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కావున త్వరగా జీర్ణంకావు. జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాకుండా కారం, మసాలా అధికంగా వాడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో మాంసం వంటి పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిదని అంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా నూనెలో బాగా వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థులు తింటే కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా జీర్ణం కాదు. అంతేకాకుండా తరుచుగా దాహం వేస్తుంది. ఎంత తాగినా దప్పిక తీరదు. అలా అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ పదార్థాలకు కొన్నాళ్లు దూరంగా ఉండాలి .
మంచినీటి విషయంలోనూ చాలా జాగ్రత్తలు అవసరం. బయట వేడిగా ఉందని చాలామంది అతి చల్లటి నీటిని తాగుతారు. అది మంచిది కాదంటున్నారు నిపుణులు. దానివల్ల దాహం తీరదు అంతేకాకుండా ఎక్కువ వేడి చేస్తుంది. వీలైతే రిఫ్రిజిరేటర్లోని నీరు కాకుండా చల్లని కుండలోనివి తాగితే మంచివి. మన శరీరానికి కావాల్సిన చల్లదనం కుండ నీటిలో ఉంటుంది.
వేసవిలో ఎక్కువగా ద్రవపదార్థాలను భాగం చేసుకోవాలి. పండ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. ఈ కాలంలో దొరికే మామిడిని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మామిడిలో ఉండే పోషక విలువలు జీర్ణక్రియను మెరుగుపర్చుతాయి. అంతేకాకుండా తియ్యని ఈ పండు ఎన్నో ఔషధగుణాలను కలిగిఉంటుంది.
ఇలా నిత్యం ఉండే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.