ఇదేం పోయే కాలంరా బాబు.. ఆవుపేడను చోరీ చేశారు

Update: 2021-06-21 05:32 GMT
అది ఇది అన్నతేడా లేకుండా కనిపించిన ప్రతి వస్తువును చోరీ చేయటం ఇప్పటివరకు తెలిసిందే. అయితే.. ఇప్పుడు జరిగిన దొంగతనం వింటే నోట మాట రాదు. దీన్ని కూడా దొంగతనం చేస్తున్నారా? అంటూ ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ హాట్ చర్చకు తెర తీసింది తాజా దొంగతనం. ఇంతకూ చోరీ అయిన వస్తువు ఏమిటో తెలుసా? ఆవుపేడ.

నమ్మబుద్ది కాకున్నా ఇది నిజం ఆవుపేడను చోరీ చేసిన వైనం తాజాగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు కావటమే కాదు.. దాన్ని దొంగతనం చేసిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ సిత్రమైన ఉదంతం ఛత్తీస్ గఢ్ లోని కోర్బా జిల్లాలోని దీప్కా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తన ఇంటి చావటి వద్ద నిల్వ చేసిన ఆవుపేడను పెద్ద ఎత్తున చోరీ అయినట్లుగా ఇంటి యజమాని గుర్తించాడు.

ఈ విషయం గ్రామంలో సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో పేడ చోరీ కావటం సంచలనమైంది. తర్వాతి రోజుకు మిగిలి ఉన్న పేడను కూడా దొంగలించటంతో లబోదిబోమన్నాడు. దీనికి కారణం లేదు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఈ మధ్యన ‘గోదాన్ న్యాయ యోజన’ పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా కేజీ పేడను రూ.2 చొప్పున కొనుగోలు చేస్తారు. తాజాగా దొంగలు ఎత్తుకెళ్లిన ఈ పేడ 800 కేజీలు ఉంటుందని తేల్చారు. పేడను దొంగలించిన కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు. ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.
Tags:    

Similar News