పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ అంటేనే అగ్గిమీద గుగ్గిలం అయ్యే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ....మరోసారి అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి ఉన్న హవాను క్యాష్ చేసుకొని బిహార్ తరహాలోనే బెంగాల్ లో పాగా వేయాలని కమలనాథులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాల్ లో ఎన్నికలకు 6 నెలలు ముందుగానే అక్కడ పరిస్థితులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో కోల్ కతాలోని డైమండ్ హార్బర్ లో బీజేపీ చేపట్టిన బహిరంగ సభకు వెళ్లిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి ఘటన సంచలనం రేపింది. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ నడ్డాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఆందోళనకారులు ఆయన కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు.
ఈ ఘటనలో కాన్వాయ్ లో నడ్డా వాహనంతోపాటు, పశ్చిమబెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి కైలాష్ విజయవర్గీయ, స్థానిక బీజేపీ నేత ముకుల్ రాయ్ వాహనాలపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ....వారిని నెట్టుకొని మరీ ముందుకు వచ్చిన ఆందోళనకారులు కాన్వాయ్ తో పాటు కాన్వాయ్ వెంట బైకులపై ఉన్న బీజేపీ కార్యకర్తలపై కూడా రాళ్లు రువ్వారు. కార్లపైకి పెద్ద పెద్ద రాళ్లు విసరడంతో నడ్డా కారు మినహా మిగతా కార్ల అద్దాలు బద్దలై రాళ్లు కార్లలో పడ్డాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో నడ్డాతో పాటు ఇతర కార్లు అక్కడ నుంచి వేరే దారిలో తప్పించుకున్నాయి. ఆ తర్వాత దారి వెంట బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆందోళనకారులు చించివేసి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాళ్ల దాడికి పాల్పడింది తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలేనని బీజేపీ నాయకులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో దీదీ సర్కార్ పై నడ్డా విమర్శలు గుప్పించారు. త్వరలోనే బెంగాల్ లో దౌర్జన్యపాలన అంతం కాబోతోందని అన్నారు. తాను సభకు రాగలిగానంటే అది దుర్గామాత దయ వల్లేనని నడ్డా ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. బెంగాల్ లో గూండా రాజ్ నడుస్తోందని, మమత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. తన కాన్వాయ్ పై జరిగిన దాడిలో బీజేపీ నేతలు ముకుల్ రాయ్,కైలాష్ వర్గీయ గాయపడ్డారని తెలిపారు. ఈ దాడి ఘటన ప్రజాస్వామానికి సిగ్గుచేటని, కాన్వాయ్ లోని ప్రతి ఒక్క కారుపై రాళ్లు రువ్వారని అన్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారులో ఉండటం వల్ల తాను సురక్షితంగా బయటపడగలిగానని నడ్డా అన్నారు. 2021లో బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఈ దాడి ఘటన క్రియేట్ చేయబడిందని,బెంగాల్ లో తమ రాజకీయ ఎజెండా కోసం శాంతికి భంగం కలిగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి సుబ్రతా ముఖర్జీ ఆరోపించారు. ఇదంతా నడ్డా ఫ్రీ ఫ్లాన్ గా చేయించిన ఘటన అని సుబ్రతా ముఖర్జీ విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.