బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొద్ది రోజులుగా శ్రద్ధగా....బుద్ధిగా బీఈడీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు....మంచి పర్సంటేజ్ తో పాసవ్వాలని అహర్నిశలు కష్టపడుతున్నారు..... ఎలాగోలా కష్టపడి పరీక్షలు రాశారు....రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.....థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ షూటింగ్ లో బిజీగా ఉన్న బిగ్ బీ....యూపీలో బీఈడీ పరీక్షలు రాయడమేమిటని ఆశ్చర్యపోకండి...ఆ పరీక్షలు రాసింది అమితాబ్ కాదు...బిగ్ బీ ఫొటో ప్రింట్ చేసిన హాల్ టికెట్ పొందిన ఓ విద్యార్థి ఆ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాను చదువుతున్న విశ్వవిద్యాలయం సిబ్బంది చేసిన తప్పిదానికి ....ఆ విద్యార్థి...అమితాబ్ ఫొటో ముందు పెట్టుకొని పరీక్ష రాయాల్సి వచ్చింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఫైజాబాద్ లోని రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయ సిబ్బంది నిర్లక్ష్యం ఓ విద్యార్థిని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ విద్యార్థి హాల్ టికెట్ పై బాపులీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఫొటోను సిబ్బంది ముద్రించారు. దీంతో, పరీక్ష హాలులో అతడిని అనుమతించలేదు. తన దరఖాస్తులో తన ఫొటో అతికించానని ఆ విద్యార్థి వాపోతున్నాడు. అమితాబ్ ఫొటోతో హాల్ టికెట్ రావడం వల్ల పరీక్ష రాయడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. అదనపు ధ్రువపత్రాలు సమర్పించాక పరీక్ష రాయడానికి అనుమతించారని, తన మార్కుల లిస్ట్ కూడా ఇలాగే వస్తుందేమోనని భయంగా ఉందని అన్నాడు. అయితే, ఈ వ్యవహారంపై ఆ సిబ్బంది మరోరకంగా స్పందించారు. దరఖాస్తు పూర్తి చేసేటప్పుడే పొరపాటు జరిగి ఉంటుందని వారు అంటున్నారు. ఏదేమైనా, మార్కుల లిస్టులో ఇలాంటి పొరపాటు రాకుండా చూసుకుంటామని సిబ్బంది తెలిపారు.