గ్రాడ్యూషన్ అయిపోయిన వెంటనే.. మాస్టర్స్ చేయటానికి అమెరికాకు ఛలో అనే వారి సంఖ్య భారత్ లో ఎక్కువే. కొందరు పై చదువుల మీద ఆసక్తితో అమెరికాకు వెళ్లాలని భావిస్తే.. మరికొందరు స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. అత్యధికులు మాత్రం మిగిలిన దేశాల కంటే కూడా అమెరికాలో చదువుకోవటానికే వెళుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్ నుంచి విదేశాల్లో విద్యను అభ్యసించటానికి వెళ్లే వారిలో 80 శాతం మంది అమెరికాకు మాత్రమే వెళ్లటం గమనార్హం.
అమెరికాకు వెళ్లటానికి కారణం లేకపోలేదు. అమెరికాలో ఉన్నత విద్య కోసం సీటు సంపాదిస్తే.. చదువుకు చదువు.. అమెరికాలో కాస్త ‘సెట్’ అయిపోయిన వెంటనే స్థానికంగా ఏదో ఒక ఉద్యోగం చూసుకునే వీలు ఉండటం.. ఏదోలా మేనేజ్ చేసుకోగలిగితే అమెరికాలో సెటిల్ అయిపోయే అవకాశాలు ఉండటంతో అమెరికా మీద కాన్సంట్రేషన్ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే.. గత రెండు నెలల వ్యవధిలో భారత్ నుంచి వెళుతున్న పలువురు విద్యార్థులు అమెరికా ఎయిర్ పోర్ట్ లలో దిగిన వెంటనే వారిని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తిప్పి పంపుతున్న పరిస్థితి.
ఎందుకిలా జరుగుతుందన్న ప్రశ్నకు.. అమెరికాకు వెళుతున్న విద్యార్థులు అనుమతి లేని వర్సిటీల్లో సీట్లు పొందుతున్నారన్న మాట వినిపించేది. ఈ మధ్యన విద్యార్థుల అర్హత మీద సందేహాలు వ్యక్తం చేస్తూ అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపటంతో పెద్ద ఎత్తున విద్యార్థులు గోడకు కొట్టిన బంతి మాదిరి స్వదేశానికి వస్తున్న పరిస్థితి.
ఎందుకిలా అంటే.. సమస్య విద్యార్థులతో పాటు.. అమెరికా విధానంలో వచ్చిన మార్పు కూడా కారణం అంటున్నారు. ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. అక్కడి స్థానికులకు ఉద్యోగాలు తక్కువగా దొరుకుతున్న నేపథ్యంలో.. విదేశీయుల పట్ల అక్కడి స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ అవకాశాల్ని విదేశీయులు కొల్లగొడుతున్నారన్న భావన రోజురోజుకి పెరుగుతోంది. దీంతో.. స్థానికంగా గొడవలు చోటు చేసుకుంటున్నాయి.
ఇలాంటి వాటితో తమ సర్కారు మీద వ్యతిరేకత పెరుగుతోందన్న భావన అధికారి డెమోక్రాట్లలో వ్యక్తమవుతోంది. అమెరికాకు విద్య పేరిట వెళుతున్న విదేశీయుల సంఖ్య ఏడాదికి కేడాది భారీగా పెరిగిపోతోంది. ఒక్క 2015లో ఇలా వెళ్లిన 1.65లక్షలు దాటింది. ఇంత భారీగా వెళుతున్న వారికి చెక్ చెప్పేందుకు వీలుగా.. అమెరికా అధికారులు సరికొత్తగా ‘వడపోత’ కార్యక్రమానికి తెర తీశారు.
దీంతో.. పరిస్థిని చక్కదిద్దుకోవటానికి తమ దేశానికి వస్తున్న విద్యార్థులను తనిఖీ పేరిట నిబంధనల్ని మరింత కఠినంగా అమలు చేయటం.. ఏ మాత్రం అనుమానం వచ్చినా.. వారిని వెనక్కి పంపించే ధోరణికి అమెరికా శ్రీకారం చుడుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. ఈ ఏడాది అమెరికా చదువు ఏ మాత్రం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది. విదేశీ విద్యకు అవసరమైన అన్ని ప్రొఫైల్స్ విషయాల్లో ఎలాంటి లోపం లేని వారు ప్రయత్నిస్తే మంచిది. లేదంటే లేనిపోని తలనొప్పులు తప్పవన్న మాటను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. డాలర్ డ్రీమ్స్ మోజులో పడి.. అరకొర అర్హతతో అమెరికా విమానం ఎక్కటమంటే.. రిస్క్ ను వెంట పెట్టుకొని వెళుతున్నట్లేనన్న విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే.. ఆచితూచి అమెరికా విద్య నిర్ణయం తీసుకోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దు.