కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.ఆయన ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని చెబుతున్నారు.ఈ సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.
విజయ్ కుమార్ కు మూడు నెలల కిందట వివాహమయ్యింది. ముందుగా రైల్వేలో పనిచేసిన విజయ్ కుమార్ ఆ తర్వాత కృష్ణా జిల్లా ముసునూరు గుడ్లవల్లేరు మండలం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం గుడివాడ ఎస్ఐ గా పనిచేస్తున్నారు. విజయ్ కుమార్ హనుమాన్ జంక్షన్ లో ఎస్సైగా పనిచేస్తుండగా బ్యూటీషియన్ తో పరిచయం పెంచుకున్నాడు. బ్యూటీషియన్ తో సంబంధాల ఆరోపణలపై గతంలో ఆయన ఓ సారి సస్పెండ్ కూడా అయ్యారు.
ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం విజయ్ కుమార్ కు వివాహమైంది. అయినా ఆయన భార్యను కాపురానికి తీసుకురాకుండా బ్యూటీషియన్ తో గుడివాడలో నివాసం ఉంటున్నట్లు విజయ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ వివాహేతర సంబంధం కారణంగానే ఆయన పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఈ కారణం గానే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.