వైవీ సుబ్బారెడ్డి... ఈ పేరు వినగానే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయే మన కళ్ల ముందు కనిపిస్తారు. మొన్నటి ఎన్నికలకు ముందు ఒంగోలు ఎంపీగా కూడా కనిపించిన సుబ్బారెడ్డికి... తన పనితీరును నిరూపించుకునే అవకాశం నిన్నటిదాకా రానే లేదనే చెప్పక తప్పదు. అంతేకాకుండా మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న సుబ్బారెడ్డికి జగన్ ఏకంగా టికెట్టే ఇవ్వలేదు. ఎన్నికలకు రంగం సిద్ధమైన తర్వాత పార్టీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి టికెట్ ఇచ్చిన జగన్.. తన బాబాయిని మాత్రం పక్కనపెట్టేశారు. ఈ క్రమంలో జగన్ కు, వైవీకి దూరం పెరిగిందన్న వార్తలూ కలకలం రేపాయి. అయితే జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ రికార్డు విక్టరీ కొట్టడం, జగన్ సీఎం అయిపోవడం వెంటవెంటనే జరిగిపోగా... తన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ గా జగన్ నియమించారు.
జగన్ తనకు పదవి ఇచ్చిన వెంటనే రంగంలోకి దిగిపోయిన సుబ్బారెడ్డి తానేంటో చేసి చూపిస్తున్నారు. తాను క్రిస్టియన్ అని, తన ఫ్యామిలీ మొత్తం ప్రార్థనల్లోనే మునిగి ఉంటుందని వైరి వర్గాలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో తనదైన శైలి సత్తాను చూపిన సుబ్బారెడ్డి... తనపైనే కాకుండా ఇకపై టీటీడీలోనూ అన్యమత ప్రచారం జరుగుతోందంటూ వస్తున్న విమర్శలను కూడా చిత్తు చేశారని చెప్పక తప్పదు. సనాతన హిందువుగానే కొనసాగుతున్న సుబ్బారెడ్డి ఏటా అయ్యప్ప మాల వేయడం మనం చూస్తున్నదే. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండానే సాగుతున్న సుబ్బారెడ్డి ఇంట ఇప్పటికీ గోమాతలు ఉండటం, ఆయన ఇంటిలో క్రమం తప్పకుండా పూజలు జరుగుతున్న వైనం కూడా తెలిసిందే. అయితే జగన్ క్రిస్టియన్ మతాన్ని స్వీకరించడంతో వైవీపైనా అదే ముద్ర వేసేందుకు వైరి వర్గాలు చేస్తున్న ఎత్తులు మాత్రం ఇప్పుడు పారడం లేదు.
మొన్నటికి మొన్న వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవి చేపట్టగానే... ముందెన్నడూ లేని రీతిలో తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని, వైవీ ఇస్తున్న ప్రోత్సాహంతోనే అన్య మతస్థులు పేట్రేగిపోతున్నారని కూడా టీడీపీ విమర్శలు చేసింది. ఈ తరహా వ్యూహాన్ని ఓ ప్లాన్ ప్రకారం సాగించిన టీడీపీ నేతలు... వైవీ సుబ్బారెడ్డిపై నిత్యం ఏదో ఒక ప్రచారం చేస్తూనే సాగారు. అంతేకాకుండా వైవీ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ఏకంగా తిరుమల కొండనే ఎంచుకున్న వైనం కూడా ఆసక్తి రేకెత్తించింది. అయితే ఈ తరహా కుయుక్తులను తనదైన శైలిలో ప్రతిఘటించిన సుబ్బారెడ్డి... అసలు తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేసే దమ్ము ఎవరికి ఉందంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శిబిరాన్ని ఆత్మరక్షణలో పడేశాయని చెప్పాలి. ఓ వైపు టీడీపీ కుయుక్తులను తిప్పికొడుతూనే... తిరుమల కొండపై వెంకన్న భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పన కోసం వైవీ సుబ్బారెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుబ్బారెడ్డి దూకుడుతో ఇప్పుడు టీడీపీ స్వరం మూగబోయిందనే చెప్పాలి.