సంచలన వ్యాఖ్యలు చేయటం.. తన మాటల్ని తూటాల్లా విసురుతూ తమ ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేయటం బీజేపీ నేత సుబ్రమణ్య స్వామికి కొత్తేం కాదు. ఆయన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు తలలు పట్టుకున్నా ఆయన మాత్రం తన దారిన తాను వెళతారే తప్ప.. ఎవరి మాటను వినేందుకు అస్సలు ఇష్టపడరు. ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ను టార్గెట్ చేసి.. ఆయనకు ఆయనే తాను పదవిలో రెండో దఫా కొనసాగనన్న విషయాన్ని తేల్చి చెప్పే వరకూ వదిలిపెట్టకపోవటం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐఐటీ ఖరగ్ పూర్ లో సీటు సాధించటం వెనుక అసలు కథ వేరుగా ఉందన్నది స్వామి ఆరోపణ. మెరిట్ ఆధారంగా కేజ్రీవాల్ సీటు సంపాదించలేదన్న స్వామి.. ఒక వెబ్ సైట్ లో ఉన్న కథనాన్ని ఆధారంగా చేసుకొని ఢిల్లీ సీఎంపై ఆరోపణాస్త్రాల్ని ఎక్కు పెట్టటం గమనార్హం. నకిలీ కోటా కింద కేజ్రీవాల్ సీటు సాధించారని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్ పై చేసిన ఆరోపణల్లో పస లేదని.. ఈ ఉదంతంలో స్వామికి ఎదురు దెబ్బ తగలటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.