త్వరలో వైసీపీ లోకి సుజనా చౌదరి.?

Update: 2019-11-24 06:21 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం త్వరలోనే బీజేపీ లో చేరబోతున్నారని ఇటీవల బీజేపీ ఎంపీ సుజనాచౌదరి  చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచిన సంగతి తెలిసిందే. అయితే అధికార వైసీపీ లో ఈ మాటల మంటలు అంటుకున్నాయి. దీని పై సుజనా చౌదరికి వైసీపీ ఎంపీలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

ఢిల్లీలో విలేకరుల సమావేశం లో మాట్లాడిన వైసీపీ ఎంపీలు.. బీజేపీ చేరాలనుకునే ఒక్క వైసీపీ ఎంపీ పేరును సుజనా చౌదరి చెప్పాలని.. లేదంటే నోరు మూసుకొని ఉండాలని అవాకులు, చెవాకులు పేలవద్దని హెచ్చరించారు.

ఈ క్రమంలోనే సుజనాచౌదరి పై వైసీపీ నర్సాపురం  ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరియే త్వరలో వైసీపీలో చేరబోతున్నారని హాట్ కామెంట్ చేశారు. రాష్ట్రలో సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ముగ్ధుడైన సుజనాచౌదరి వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఢిల్లీ బాసులను సంతృప్తి పరచడానికి, తనపై కేసులు పరిష్కరించుకోవడానకే సుజనా బీజేపీలో చేరారని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీలో భవిష్యత్తు లో బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని.. వైఎస్ జగన్ గ్రాఫ్ ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోందని.. ఏ నాయకుడైనా అధికారంలో ఉండే పార్టీలోనే ఉంటాడని.. అందుకే సుజనా వైసీపీలో చేరబోతున్నాడని పురం  ఎంపీ రఘురామకృష్ణం రాజు  క్లారిటీ ఇచ్చారు. కాబట్టి అధికారంలో ఉండే వైసీపీ నుంచి ఎంపీలు ఎందుకు మరో పార్టీలో  చేరుతారని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ నాయకుల ను బీజేపీ లో చేరుతారని అనబోయి వైసీపీ ఎంపీలు అని  సుజనా అని ఉండవచ్చు అని రఘురామకృష్ణం రాజు వివరణ ఇచ్చారు. ఏపీలో బీజేపీకి చాన్స్ లేదని.. అలాంటప్పుడు బీజేపీలో వైసీపీ ఎంపీలు ఎందుకు చేరుతారని ఆయన ప్రశ్నించారు. కేవలం అలజడి సృష్టించడానికే సుజనా మాట్లాడుతున్నాడని విమర్శించాడు.
Tags:    

Similar News