సినీ నటి కమ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న సుమలత అంబరీశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిందన్న విషయాన్ని చెప్పి హాట్ టాపిక్ గా మారారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే తపన కానీ.. పదవులు అనుభవించాలన్న ఆసక్తి కానీ లేదన్నారు.
తన భర్త మరణించిన తర్వాత.. ఆయన ద్వారా లబ్థి పొందిన వారు సైతం తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని.. అందుకే అలాంటి వారితో తేల్చుకోవటానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లుగా పేర్కొన్నారు. తన భర్త దూరమైన రెండు నెలలకే బెదిరించారని ఆమె వ్యాఖ్యానించారు.
తాజాగా ఒక కన్నడ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు సంచలన అంశాల్ని చెప్పుకొచ్చారు. అంబరీశ్ మరణం తర్వాత మాండ్య జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్దంతి సభల్ని అభిమానులు నిర్వహించారని.. వాటిని కొడుకుతో కలిసి తాను వెళ్లానన్నారు. తమతో కలిసి ఉండేలా రాజకీయాల్లోకి రావాలని పలువురు కోరారని వెల్లడించారు.
రాజకీయాలు అంత సులువు కాదన్న ఉద్దేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదున్నారు. అలాంటి సమయంలో జేడీఎస్ కు చెందిన ముఖ్యుడు మంత్రి రేవణ్ణ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. భర్త కోల్పోయిన ఒక మహిళ పట్ల కనీస సానుభూతి కూడా లేకుండా అనుచితంగా మాట్లాడటాన్ని తాను జీర్ణించుకోలేకపోయానన్నారు. అందుకే రాజకీయ ప్రవేశం చేశానని చెప్పారు.
అంబరీశ్ కారణంగా లబ్థి పొందినోళ్లు మాకు వ్యతిరేకులు అయ్యారు. అంబరీశ్ సత్తా ఏమిటో చూపిద్దామని అనుకునే.. స్వతంత్రంగా పోటీ చేసినట్లు పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన నటులు దర్శన్.. యశ్ లు.. నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్ లు వ్యక్తిగతంగా నష్టం కలిగేలా కొన్ని ప్రయత్నాలు సాగినా.. వాటికి వెనక్కి తగ్గకుండా తమతో ఉన్నారన్నారు. తాజాగా సుమలత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.