సెల్ఫీ పిచ్చి ఎక్కడికి చేరిపోతుందనేందుకు ఇదే నిదర్శనం. సెల్ఫీ మూర్ఖత్వంలో పడి సమయం - సందర్భం...మంచి - చెడు అనేది లేకుండా ప్రవర్తించిన రాజస్థాన్ మహిళా కమిషన్ సభ్యురాలు చిక్కుల్లో పడ్డారు. ఓ అత్యాచార బాధితురాలితో ఆమె దిగిన సెల్ఫీ వివాదమవుతోంది. దీనిపై కమిషన్ చైర్ పర్సన్ సుమన్ శర్మ ఆ సభ్యురాలి నుంచి రాతపూర్వక వివరణ కోరారు. అయితే ఆ సెల్ఫీలో చైర్ పర్సన్ కూడా ఉండటం గమనార్హం.
సోమ్యా గుర్జార్ అనే ఆ సభ్యురాలు సదరు బాధితురాలిని కలవడానికి మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లినపుడు సెల్ఫీ తీసుకున్నారు. ఇది కాస్త ప్రచారంలోకి రావడంతో వివాదంగా మారింది. అయితే తాను బాధితురాలితో మాట్లాడుతున్న సమయంలో సోమ్యా సెల్ఫీ తీసుకున్నారని, ఆ విషయం తనకు తెలియదని చైర్ పర్సన్ సుమన్ శర్మ అన్నారు. ఇలాంటి చర్యలను తాను సమర్థించనని, దీనిపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా ఆమెను ఆదేశించినట్లు చెప్పారు. అయితే తనకు తెలియకుండానే ఫొటో తీసిందని సుమన్ శర్మ చెబుతున్నా.. ఫొటోలో మాత్రం ఆమె కూడా కెమెరావైపే చూస్తున్నట్లు కనిపించడం విశేషం. రెండు రోజుల కిందట ఆ మహిళను భర్త - మరదలే తీవ్రంగా హింసించి, ఒళ్లంతా పచ్చబొట్టు పొడిచి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు.