దిశ ఘ‌ట‌న నీ ఇంట్లో జ‌రిగితే ఇలాగే చేస్తావా ప‌వ‌న్?

Update: 2019-12-05 11:01 GMT
దేశ‌ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ హ‌త్య కేసుపై జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందిస్తూ...`ఆడపిల్ల బయటకువెళ్లి ఇంటికి తిరిగిరాకపోతే.. ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే.. చేసిన అబ్బాయిని రెండు బెత్తం దెబ్బలు చెమ్డాలు ఊడిపోయేలా కొట్టాలి. అందరూ చూస్తుండగా కొట్టాలి’ అని పేర్కొన్న విషయం పెద్ద ఎత్తున వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మహిళలు - మేధావులు - రాజకీయ నాయకులు పవన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించ‌డ‌మే కాకుండా ఆ కామెంట్ల‌పై మండిపడుతున్నారు. తాజాగా సినీన‌టుడు సుమ‌న్ సైతం ప‌వ‌న్ కామెంట్ల‌ను త‌ప్పుప‌ట్టారు. గుంటూరులో సుమ‌న్ మీడియాతో మాట్లాడుతూ...త‌న ఇంట్లో ఇలాగే జ‌రిగితే ప‌వ‌న్ ఏం చేస్తార‌ని ప్ర‌శ్నించారు.

అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సుమ‌న్‌...ఇలాంటి ఘటనల్లో బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని పవన్‌ కు హితవు పలికారు. మ‌హిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలని ప‌వ‌న్ పేర్కొన‌డం దారుణమన్నారు. అలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్‌ ఇలాగే అంటారా అని సుమ‌న్ సూటిగా ప్రశ్నించారు. త‌ల్తిదండ్రులు సైతం త‌మ పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని సుమన్ ఈ సంద‌ర్భంగా కోరారు. ఆడ‌పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు వివిధ ర‌క్ష‌ణ అంశాల గురించి తెలియ‌జెప్పాల‌ని - అబ్బాయిల‌ను స‌రైన రీతిలో పెంచాల‌ని ఈ సంద‌ర్భంగా సుమ‌న్ సూచించారు.
Tags:    

Similar News