భానుడి భగభగతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా. శనివారం దేశ సరాసరి ఉష్ణోగ్రత 45 నుంచి 46 డిగ్రీల మధ్యన ఉండటం చూస్తే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమైపోతుంది.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వృద్ధులు.. అనారోగ్యంతో ఉండే వారితో పాటు.. కూలీలు భారీగా మృత్యువాత పడుతున్నారు. శనివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 642 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. మృత్యువాత పడిన వారిలో కూలీలు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఉపాధి కోసం కూలీ పనులకు వెళ్లిన వారిపై సూర్యరశ్శి నేరుగా పడటంతో వారు తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. శనివారం ఎండ తీవ్రతకు ఏపీలో 391 మంది.. తెలంగాణ రాష్ట్రంలో 251 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా ఒక్క ప్రకాశం జిల్లాలోనే 98 మంది భానుడికి బలయ్యారు. కృష్ణా.. గుంటూరు జిల్లాల్లోనూ వరుసగా.. 56.. 57 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక.. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో అత్యధికంగా 62 మంది మృత్యువాత పడ్డారు. నల్గండలోనూ 53 మంది మృతి చెందారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండ తీవ్రతకు బలైన వారు ప్రతి జిల్లాలోనూ ఉండటం గమనార్హం. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరులో అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ భారీ ఉష్ణోగ్రత నమోదైనట్లు చెబుతున్నారు.
ఇక.. ఏపీ తాత్కలిక రాజధానిగా వ్యవహరిస్తున్న బెజవాడ.. భానుడి దెబ్బకి భగభగలాడిపోయింది. శనివారం మధ్యాహ్నానానికి విజయవాడ విమానాశ్రయం గన్నవరంలో అత్యధికంగా 47.3 డిగ్రీలు నమోదైంది. దీంతో.. విజయవాడ ఎండ తీవ్రతతో మండిపోతున్న పరిస్థితి. ఈ వేడి తీవ్రత మరో రెండు రోజులు కొనసాగవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.