సుంద‌ర్ పిచయ్‌ కు గూగుల్ గుడ్ న్యూస్‌

Update: 2017-04-29 11:14 GMT
ఇంటర్నెట్ దిగ్గ‌జం గూగుల్ త‌న సీఈఓ సుందర్ పిచయ్‌ కి ఊహించ‌ని తీపి క‌బురు అందించింది. ఆయ‌న‌కు రెట్టింపు జీతాన్ని అందజేయ‌నున్న‌ట్లు  గూగుల్‌ ప్ర‌క‌టించింది.  2016 సంవ‌త్స‌రానికి గాను సుంద‌ర్  220 మిలియ‌న్ల డాల‌ర్లు అంటే రూ.1285 కోట్ల వేతనాన్ని ప‌రిహారంగా గెలుచుకున్నారు. 2015వ సంవ‌త్స‌రంతో పోలిస్తే పోలిస్తే ఇది రెట్టింపు ఆదాయం కావ‌డం విశేషం. గ‌త ఏడాదిలో పిచ‌య్ ప్రతినెల జీతం కింద ఆరున్న‌ర ల‌క్ష‌ల డాల‌ర్లు ఆర్జించారు.

2015 ఆగ‌స్టులో పిచ‌య్ ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ సీఈఓ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు స్టాక్‌ అవార్డు కింద 200 మిలియన్ డాల‌ర్లు వ‌చ్చాయి. మ‌రోవైపు గూగుల్ అమ్మ‌కాలు 22.5 శాతం పెరిగాయి. దాని నిక‌ర ఆదాయం కూడా 19 శాతం పెరిగింది. దీంతో సుంద‌ర్ పిచ‌య్  గూగుల్ సంస్థ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. అత్యుత్తమంగా రాణిస్తున్న ఉద్యోగుల‌కు గూగుల్ సంస్థ ప్ర‌తి ఏడాది కాంపెన్షేష‌న్ ఇస్తుంది. గూగుల్ క్రోమ్ - క్రోమ్ ఓఎస్ లాంటి ఉత్పత్తులను నిర్మించడంలో పిచ‌య్ కీలక పాత్ర పోషించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News