యోగీ పొలిటికల్ ఎంట్రీ వెనక సూపర్ ఫ్లాష్ బ్యాక్... ?

Update: 2021-12-31 13:30 GMT
ఇప్పటికి రెండున్నర దశాబ్దాల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ భాషా మూవీ వచ్చింది. ఆ మూవీలో ఇంటర్వెల్ తరువాత రజనీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అది అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్. అప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ కి ప్రతీ మూవీలో ఎంతో డిమాండ్ వచ్చిపడింది. ఇదిలా ఉంటే పొలిటీషియన్స్ కి కూడా బ్రహ్మాండమైన ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. అవి వారు రివీల్ చేస్తే తప్ప బయట ప్రపంచానికి తెలియదు.

లేటెస్ట్ గా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూపీ సీఎం ఆదిత్యానాధ్ యోగి తన సూపర్ ఫ్లాష్ బ్యాక్ గుట్టు విప్పారు. ఆయనకు రాజకీయాలకు సంబంధం లేని రోజులవి. అలాంటి ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఘటనకు అప్పట్లో యూపీలో జరిగాయట. యోగీ 1994 ప్రాంతంలో గోరఖ్ పూర్ మఠంలో ఉండేవారు. ఆ ప్రాంతంలో మాఫియా గ్యాంగ్స్ ఎక్కువగా ఉండేవట. అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన భవనాన్ని మాఫియాకు కట్టబెట్టిందని, దాన్ని తాను కళ్ళారా చూశానని యోగీ చెప్పారు.

అలాగే అదే గోరఖ్ పూర్ లో ఒక సంపన్నుడి నివాసాన్ని ఒక మంత్రి ఆక్రమించుకున్నారని యోగీ చెప్పారు. తాను అక్కడకి వెళ్ళి ప్రతిఘటించానని, ప్రజలను కూడా ఎదురుతిరగమని కోరానని చెప్పారు. అయినా నాడు మాఫియాదే పై చేయి అయిందని ఆయన వివరించారు. ఇలా మాఫియా డాన్ల రాజ్యం ఒకనాడు యూపీని అతలాకుతలం చేసిదని ఆయన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకున్నారు.

మాఫియాల వల్ల సామాన్యులు, పెద్దలకు ఎలాంటి రక్షణ లేకుండా పోవడం వల్లనే తాను రాజకీయాల్లొకి రావాలని నాడే గట్టిగా నిర్ణయించుకున్నానని యోగీ చెప్పారు. అలా తాను పాలిటిక్స్ లోకి వచ్చి నాలుగు సార్లు ఎంపీ అయ్యానని, చివరికి సీఎం అయ్యానని ఆయన చెప్పారు. తాను అయిదేళ్ల పాలనలో మాఫియాల కోరలు విరిచేశానని ఆయన వెల్లడించారు.

ఈ రోజు ఎవరి భూమిని అయినా మాఫియాలు ఆక్రమించుకుంటే బుల్డోజర్లు వస్తాయని వారికి బాగా తెలుసు. అందుకే ఎవరూ ఆ దుస్సాహం చేయరు. ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నారని ఆయన చెప్పారు. నేరగాళ్ళను, మాఫియాలను ఏరేసే తమ పాలనకు జనాల నుంచి పూర్తి మద్దతు ఉందని యోగీ చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికలలో 350 సీట్ల కంటే ఎక్కువే తమ పార్టీకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చేది మేమే అంటూ యోగీ అపుడే విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. మేము చేసిన మంచి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని ఆయన తెలిపారు. సో యోగీయే మళ్ళీ యూపీ సీఎం అన్న మాట.




Tags:    

Similar News