సాధారణంగా మనం ఇళ్లు భూమి మీద కడుతాం...ఆకాశాన్ని తాకే అత్యంత భారీ భవనాలు నిర్మిస్తున్నాం.. చంద్రుడు - అంగారకుడిపై కూడా ఇండ్లు కట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. కానీ న్యూయార్క్ కు చెందిన నిర్మాణ సంస్థ క్లౌడ్స్ ఏవో మాత్రం దీనికి భిన్నం. ఆకాశం నుంచి భూమి మీదికి వచ్చేలా ఓ భారీ బహుళ అంతస్తుల భవనం కడుతానని చెప్తోంది. పైగా అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుందని.. ఉత్తర - దక్షిణ అర్ధగోళాల్లోని పలు నగరాలు, పట్టణాల మీదుగా ప్రయాణిస్తుందని.. సరిగ్గా 24 గంటల తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి చేరుకుంటుందని చెప్తున్నది. పైగా ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనంగా నిలుస్తుందట. ఏంటి ఇవన్నీ నిజమేనా...అంటే తమ సంస్థ రూపొందించిన ప్లాన్ ప్రకారం ఇవి నిజమేనని చెప్తోంది.
ఈ ఆశ్చర్యకరమైన నిర్మాణం గురించి సంస్థ వివరిస్తూ భూమికి 50 వేల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ఉన్న ఓ ఖగోళ వస్తువుకు భారీ తాళ్లను బిగించి.. వాటి ఆధారంగా అక్కడి నుంచి భూమివైపు భవనాన్ని నిర్మిస్తారు! ఆస్టరాయిడ్ నుంచి వేలాడదీసేందుకు అత్యంత దృఢమైన కేబుళ్లతో యూనివర్సల్ ఆర్బిటాల్ సపోర్ట్ సిస్టంను రూపొందిస్తారు!! భవన నిర్మాణంలో అత్యాధునిక ఇంజినీరింగ్ పద్ధతులు వాడుతారు. ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఎత్తును, ఆకారాన్ని మార్చుకునే కిటికీలను వినియోగిస్తారు. భవనానికి పైన బిగించే సౌరఫలకాల ద్వారా విద్యుత్ ను సరఫరా చేస్తారు. నీటిని ఎప్పటికప్పుడు నేరుగా మేఘాల నుంచి సేకరిస్తారు! ఇందులో వ్యాపార కేంద్రాలు, నివాసాలు ఉంటాయి!! ఈ భవనాన్ని దుబాయ్ లో నిర్మించాలని సంస్థ భావిస్తున్నది. అక్కడైతే అమెరికా కన్నా చాలా తక్కువ ఖర్చులో నిర్మాణం పూర్తి చేయవచ్చునని చెప్తున్నది. ఈ నిర్మాణానికి సరిపోయే ఆస్టరాయిడ్ ను తాము గుర్తించాల్సి ఉన్నదని పేర్కొంది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రాబోయే కొన్నేళ్లలో ఆస్టరాయిడ్ మీద పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని, కాబట్టి తమ ప్లాన్ ఊహాజనితం కాదని బల్లగుద్ది మరీ చెప్తోంది. ఇది ఆచరణలో సాధ్యమయ్యేదేనా అంటారా? వేచి చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/