జమ్ముకశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకున్న వరుస నిర్ణయాల అనంతరం.. స్థానికంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పలువురు కశ్మీరీ అగ్రనేతల్ని గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఇలా ఉన్న వారిలో మాజీ ముఖ్యమంత్రి కమ్ పీడీఎఫ్ అధినేత మెహబూబా ముఫ్తీతో పాటు.. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాతో పాటు పలువురు హురియత్ నేతలు ఉన్నారు.
తన తల్లి ముఫ్తీని కలిసేందుకు ఆమె కుమార్తె సనా ఇల్తిజా జావేద్ ప్రయత్నించారు. అయితే.. అధికారులు ఆమెను అనుమతించలేదు. దీంతో ఆమె.. సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. తన తల్లి.. కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా లేదన్నారు. ఈ క్రమంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరును తప్పు పట్టారు.
తాజాగా సనా పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రెండు వర్గాల వాదనను విన్న అనంతరం.. ముఫ్తీని కలుసుకునేందుకు ఆమె కుమార్తెకు అనుమతి ఇచ్చారు. అయితే.. ఆమెను కలవటానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. తాము ఇచ్చిన అనుమతి కేవలం సనా తన తల్లిని కలవటానికే కానీ.. శ్రీనగర్ లో స్వేచ్ఛగా సంచరించటానికి కాదని.. అందుకు స్థానిక అధికారుల అనుమతి అవసరమని పేర్కొన్నారు.