దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల్ని ఇట్టే అమలవుతుంటాయన్న భావన ఉంటుంది. కానీ.. ఈ ఉదంతం గురించి తెలిశాక మాత్రం.. అలాంటి అభిప్రాయం ఏమైనా ఉంటే వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది. విన్నంతనే ఉలికిపాటుకు గురి కావటమే కాదు.. ఇలా కూడా జరుగుతుందా? అన్న భావన కలిగే ఈ ఉదంతంలోకి వెళితే..భార్యను హత్య చేసిన కేసులో నెల్లూరు జైల్లో తొమ్మిదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న గోపిశెట్టి హరిక్రిష్ణ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్.. జస్టిస్ ఎస్.రవింద్రభట్.. జస్టిస్ పీఎస్ నరసింహ.. జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా తమ ద్రష్టికి వచ్చిన అంశాలపై విస్మయంతోపాటు.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే.. సదరు ఖైదీకి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు 2020 సెప్టెంబరు 28న ఉత్తర్వులు ఇస్తే.. వాటిని అమలు చేయకుండా గత నెల 20న (2022 ఏప్రిల్ 20న) బెయిల్ ఇవ్వటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులను సరిగా అర్థం చేసుకోకుండా.. జైల్లో ఉన్న ఖైదీని విడుదల చేయటంలో జాప్యం చేసిన ఉదంతంలో నెల్లూరుజిల్లాలోని ఒక అదనపు సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు మండిపడింది. తమ ఉత్తర్వులను అర్థం చేసుకునే విషయంలో సదరు న్యాయాధికారి వ్యవహరించిన తీరు చూస్తే.. జ్యూడిషియల్ అకాడమీలో ఎలాంటి శిక్షణ ఇచ్చారో తమకు అర్థం కావట్లేదని.. ఆ పెద్ద మనిషి ఎవరో తాము తెలుసుకోవాలని అనుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా న్యాయాధికారి వైఖరితో బాధితుడు రెండేళ్లు జైల్లోనే ఉండాల్సి వచ్చిందన్న ఆవేదనను వ్యక్తం చేస్తూ.. సదరు అధికారి వైఖరి చూస్తే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే శిక్షన ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు.
బెయిల్ పై విడుదల చేయాలని స్పష్టంగా చెప్పినా.. విడుదల చేయకుండా జైల్లోనే ఉంచటంపై పోలీసులు.. జైలు అధికారులను సంజాయిషీ కోరింది. అంతేకాదు.. సదరు న్యాయాధికారి నుంచి ఏపీ హైకోర్టు సంజాయిషీ అడిగి.. పాలనపరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నట్లు పేర్కొన్నారు ఇలాంటి అంశాల పరిశీలన కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
సుప్రీంకోర్టు జారీ చేసిన బెయిల్ ఉత్తర్వులు ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయో హైకోర్టు నివేదిక ఇవ్వాలని.. అలాంటి కేసులను ఆ తర్వాతి నెలలో సంబంధిత కోర్టు ముందు ఉంచి బెయిల్ పై విడుదల కాని వారికి ఉపశమనం కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ పుణ్యమా అని.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని సైతం స్థానిక న్యాయాధికారులు కొందరు తొక్కిపెట్టేసిన షాకింగ్ వైనం బయటకు వచ్చిందని చెప్పాలి.