చాలా రోజులుగా నలుగుతున్న జగన్ సర్కార్ వర్సెస్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు ఎట్టకేలకు సుప్రీం కోర్టులో మరోసారి మలుపు తిరిగింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. గవర్నర్ లేఖ పంపినా రమేశ్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణమని సుప్రీం వ్యాఖ్యానించింది. దీంతో సుప్రీం స్టే కు నిరాకరించడంతో ఏపీ ప్రభుత్వానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
హైకోర్టు తీర్పుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని నిమ్మగడ్డ తరుఫు లాయర్ కోర్టుకు వివరించారు. దీన్ని కూడా సుప్రీం తప్పుపట్టింది. రమేశ్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం గవర్నర్ కు ఉందని చెప్పింది.
హైకోర్టు తీర్పుపై స్పెషల్ లీవు పిటీషన్ ను ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసింది. ఇక హైకోర్టు తీర్పును అమలు చేయలేదని ఏపీసర్కార్ పై నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీం కోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పునిచ్చింది.