ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లతో పాటుగా మరిన్ని సోషల్ మీడియా యాప్స్ లో వచ్చే తప్పుడు వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలకు ఆయా సంస్థలనే బాధ్యులుగా చేయాలన్న విషయంలో అభిప్రాయం తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, సంబంధిత వర్గాలకు నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్ ను ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామ సుబ్రమణియన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివాటిలో నకిలీ వార్తలు, రెచ్చగొట్టే ప్రసంగాలు సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయని అడ్వొకేట్ వినీత్ జిందాల్ తన పిటిషన్ లో కోర్టుకు వివరించారు. ఆయా వివాదాస్పద అంశాలకు సోషల్ మీడియా సంస్థలనే బాధ్యులను చేయాలని, అలాగే నియంత్రణకు చట్టం తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వా న్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. సాధారణ మీడియా కంటే వంద రెట్ల వేగంతో ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతోందని, దీంతో చాలా సందర్భాల్లో మత ఘర్షణలు, వివాదాలు పెరిగి దేశంలో అశాంతికి కారణమవుతోందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ తోపాటు మీడియా చానెళ్లు, నెట్ వర్క్ సంస్థలకు సంబంధించి మీడియా ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలన్న పిటిషన్ ను కలిపి విచారించిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మీడియా, చానెళ్లు, నెట్‌వర్క్‌లపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్‌ను జనవరి 25వ తేదీన విచారించిన ధర్మాసనం.. కేంద్రంతోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్‌లకు నోటీసులు జారీ చేసింది.