సుదర్శన్ టీవీ దేశానికి హానికరం: సుప్రీం

Update: 2020-09-15 17:30 GMT
మైనారిటీ వ్యతిరేక కథనాలు ప్రసారం చేసే హిందుత్వ భావజలం గల ‘సుదర్శన్ టీవీ’పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా స్వేచ్ఛ పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించింది. ‘యూపీఎస్సీ జీహాద్’ అనే కార్యక్రమం ప్రసారం చేయకూడదని ఆదేశాలిస్తూ సుదర్శన్ టీవీ దేశానికి హానికరం అంటూ వ్యాఖ్యానించింది.

యూపీలోని నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ‘సుదర్శన్ టీవీ’ మొదటి నుంచి మైనార్టీ వ్యతిరేక కథనాలతో వివాదాలకు కారణమవుతోంది. ఈ మధ్య వివాదాస్పదమైన కథనాన్ని రూపొందించింది.

‘యూపీఎస్సీ జీహాద్’ పేరిట సుదర్శన్ టీవీ రూపొందించిన ఈ కార్యక్రమంలో ముస్లింలు యూపీఎస్సీ సాధించడం కుట్రగా అభివర్ణించింది.ఈ కార్యక్రమం విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా ఉందని.. దాని ప్రసారాలు నిలిపేయాలని మాజీ ఐఏఎస్ అధికారులు సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు.

ఈ పిటీషన్ విచారించిన సుప్రీం యూపీఎస్సీ, ముస్లింల ప్రతిష్ట దెబ్బతినేలా సదురు మీడియా సంస్థ వ్యవహరించడం ఖండనీయమని.. ఇలాంటి కథనాలు హానికరమని.. మీడియా స్వేచ్ఛ పేరుతో ఎలా పడితే అలా చేయడం కుదరదని సుదర్శన్ టీవీకి మొట్టి కాయలు వేసింది.
Tags:    

Similar News