గోరఖ్ పూర్ అల్లర్ల కేసు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మెడకు చుట్టుకుంది. అలహాబాద్ కోర్టు కొట్టివేసిన ఈ పిటీషన్ ను సుప్రీం కోర్టు స్వీకరించి యోగికి నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు మలుపుతిరిగింది..
2007లో గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ కు అక్కడ జరిగిన అల్లర్లలో ప్రమేయం ఉందని.. దీనిపై విచారణ జరపాలంటూ అలహాబాద్ కోర్టులో మహ్మద్ హయత్ - పర్వేజ్ లు రిట్ పిటీషన్ వేశారు. కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చి కొట్టివేసింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లగా తాజాగా సుప్రీం స్పందించింది. ఈ కేసును, యోగిపై అభియోగాలను ఎందుకు విచారణ చేయకూడదో చెప్పాలని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
2007లో గోరఖ్ పూర్ లో మొహర్రం సందర్భంగా హిందూ -ముస్లింల మధ్య ఘర్షణ జరిగింది. రాజ్ కుమారి అగ్రహారి అనే హిందూ మతానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలంలో అప్పటి ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ధర్నా చేసి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన అనుచరులు కొన్ని ముస్లిం కట్టడాలకు నిప్పటించారు. యోగిని అరెస్ట్ చేయగా.. ఆయన సానుభూతి పరులు గోరఖ్ పూర్ గోదాన్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టారు. ఆ కేసులో ఇప్పుడు యోగిని విచారించడానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.