సరిహద్దులపై తొందరలోనే నిఘా నేత్రం

Update: 2021-03-08 11:30 GMT
పొరుగుదేశాలతో మన దేశానికి తరచుగా తలెత్తుతున్న సరిహద్దు వివాదాలకు మన శాస్త్రజ్ఞులు చెక్ చెప్పబోతున్నారు. ఈనెల 28వ తేదీన జీఐశాట్ 1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు. ఈ ప్రయోగానికి శ్రీహరికోటలో ఇప్పటికే  సర్వం సిద్ధమైపోయింది. ఈ ఉపగ్రహం ప్రధానంగా సరిహద్దుల్లో నిఘా కోసమే మనదేశం ఉపయోగించుకోబోతోంది. దేశ సరిహద్దులో పొరుగు దేశాల సైన్యాల కదలికలతో పాటు అనుమానాస్పదంగా ఉన్న ప్రతి డెవలప్మెంటును ఇట్టే పసిగట్టేస్తుంది.

మనకు ఒకవైపు దాయాది దేశం పాకిస్ధాన్, మరోవైపు డ్రాగన్ దేశపు సైన్యాలు ప్రతిరోజు వివాదాలు రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఉద్దేశ్యపూర్వకంగా, వ్యూహాత్మకంగా మనదేశంలోకి శతృదేశాల సైన్యాలు చొచ్చుకుని వచ్చేస్తున్నాయి. అదేమంటే చెప్పా పెట్టకుండానే మన సైన్యంపై ఇప్పటికి ఎన్నిసార్లు దాడులు చేసింది అందరికీ తెలిసిందే. లడ్డాఖ్ లోని గాల్వాన్ లోయలో ఆమధ్య జరిగిన చైనా సైన్యానికి మన సైనికులకు ఎంత భీకర గొడవ జరిగిందే గుర్తుండే ఉంటుంది. ఆ గొడవలో మన సైనికులు 20 మంది చనిపోతే డ్రాగన్ సైనికులు 45 మంది మృతి చెందారు.

సరిహద్దుల దగ్గర గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే సరిహద్దు రేఖలను దాటి పాకిస్ధాన్ , డ్రాగన్ సైన్యం తరచు మన భూభాగంలోకి వచ్చేస్తున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించే కుట్రలతోనే రెండు వైపులా సైనికులు ఈ దురాగతాలకు దిగుతున్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. మన శాస్త్రజ్ఞులు రూపొందించిన జీఐశాట్ 1 ఉపగ్రహం ప్రయోగం గనుక సక్సెస్ అయితే సరిహద్దు వివాదాలు దాదాపు తగ్గిపోయే అవకాశాలున్నాయి.

ఎందుకంటే శతృదేశాల సైన్యం కదలికలే లక్ష్యంగా ఈ ఉపగ్రహం ప్రయోగం జరుగుతోంది కాబట్టి వాళ్ళ కదలికలన్నీ ఎప్పటికప్పుడు మనకు తెలిసిపోతుంటుంది. వేసవి కాలంలో మన సైన్యానికి కాపలా విషయంలో ఇబ్బందులు లేకపోయినా చలికాలంలో మాత్రం సమస్యల తప్పటం లేదు. ఇదే వాతావరణం శతృదేశాల సైన్యాలకు కూడా ఇబ్బందే అయినా ఆక్రమణలే టార్గెట్ కాబట్టి వాళ్ళ కుట్రలకు శీతాకాలన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇటువంటి అనేక సమస్యలకు చెక్ చెప్పటానికే మనదేశం నిఘా నేత్రాన్ని ప్రయోగిస్తోంది. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో.
Tags:    

Similar News