అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడుల అంశం గురించి ఇవాళ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ లోక్ సభలో అధికార ఆమె ప్రకటన చేశారు. ముందుగా కన్సాస్ లో హత్యకు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ ఘటనను ఖండించారు. భారతీయులపై జరిగిన దాడి అమెరికన్ల మైండ్ సెట్ ను ప్రతిబింబించదని అగ్రదేశ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సుష్మా తెలిపారు. కన్సాస్ లో జరిగిన జాతివివక్ష దాడిని ఎఫ్ బీఐ విచారణ చేస్తున్నదని ఆమె చెప్పారు. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర ప్రభుత్వం మౌనంగా లేదని ఆమె స్పష్టం చేశారు.
అమెరికా వెళ్తున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వ ఎటువంటి ట్రావెల్ అడ్వైజరీని సూచించలేదని సుష్మా తెలిపారు. భారతీయులకు రక్షణ కల్పించేందుకు అమెరికా హామీ ఇచ్చినట్లు ఆమె తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా కన్సాస్ దాడిని ఖండించిన అంశాన్ని ఆమె గుర్తు చేశారు. కూచిభొట్ల కుటుంబసభ్యులతో తాను మాట్లాడినట్లు, జాతివివక్ష దాడుల అంశాన్ని అమెరికా అధికారులతోనూ ముచ్చటించినట్లు సుష్మా తెలిపారు. మార్చి 4వ తేదీన కూడా సియాటెల్ లో దీప్ రాయ్ అనే వ్యక్తి కాల్పులకు బలయ్యాడు. మీ దేశానికి వెళ్లిపోవాలంటూ అరుస్తూ ఓ అమెరికన్ అతనిపై కాల్పులు జరిపాడు. ఆ ఘటన పట్ల కూడా అమెరికా ప్రభుత్వం స్పందించినట్లు సుష్మా తెలిపారు. భారత సంతతి ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా వెల్లడించిందని సుష్మా చెప్పారు.
కాగా, కొన్ని నెలల క్రితం కిడ్నీ మార్పిడి చేసుకున్న సుష్మా తొలిసారి బడ్జెట్ సమావేశాలకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. సుష్మా దీర్ఘ కాలం జీవించాలంటూ కోరుకున్నారు. చాలా రోజుల తర్వాత మీ స్వరం వినపడడం సంతోషంగా ఉందని సుష్మాను స్పీకర్ మెచ్చుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/