ప‌రిపూర్ణానంద‌కు హైకోర్టు ఊర‌ట‌..!

Update: 2018-08-14 07:27 GMT
సంచ‌ల‌నం సృష్టించిన ప‌రిపూర్ణానంద స్వామిపై విధించిన బ‌హిష్క‌ర‌ణ వేటుపై హైకోర్టు తాజా ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. హైకోర్టులో ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించింది. ప‌రిపూర్ణానంద‌పై విధిస్తూ హైద‌రాబాద్‌.. సైబ‌రాబాద్‌.. రాచ‌కొండ క‌మిష‌న‌రేట్ల ప‌రిధిలో విధించిన‌ బ‌హిష్క‌ర‌ణను ఎత్తివేస్తూ తాజాగా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

శ్రీ‌రాముడిపై క‌త్తి మ‌హేశ్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆయ‌న‌పై పోలీసులు న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌ను విధించారు. అనంత‌రం ఈ ఇష్యూలో ప‌రిపూర్ణానంద స్వామిపైనా బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు. అయితే.. త‌న‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు స‌రి కాదంటూ ప‌రిపూర్ణానంద హైకోర్టును ఆశ్ర‌యించారు.

ప‌రిపూర్ణానంద‌పై విధించిన బ‌హిష్క‌ర‌ణను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ.. బీజేపీ.. భ‌జ‌రంగ్ ద‌ళ్.. విశ్వ‌హిందూ ప‌రిష‌త్.. సంఘ్ ప‌రివార్ శ్రేణులు హైద‌రాబాద్‌.. రంగారెడ్డి క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. ప‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ఇలాంటి వేళ‌.. ప‌రిపూర్ణానంతపై విధించిన బ‌హిష్క‌ర‌ణ‌ను తొల‌గిస్తూ.. హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నిర్ణ‌యం పోలీసుల‌కు ఎదురుదెబ్బ‌గా భావిస్తున్నారు. తొంద‌ర‌పాటుతో పోలీసులు నిర్ణ‌యం తీసుకున్నార‌న్న భావ‌న ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News