ఎగ్జిబిటర్లతో మంత్రి తలసాని కీలక భేటి

Update: 2021-08-10 08:45 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. చాలారోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈరోజు ఉదయం సంబంధిత శాఖల అధికారులతో ఈ మేరకు కీలక భేటికి రెడీ అయ్యారు.

ఈ సమావేశంలో సినిమాల ప్రదర్శనలకు వెసులుబాటుపై చర్చించనున్నారు. 5వ షో ప్రదర్శన.. లాక్ డౌన్ లో థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల రద్దుపై మంత్రి తలసానితో ఎగ్జిబిటర్లు చర్చించనున్నారు.

ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ చార్జి వసూలు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో సినీ ఎగ్జిబిటర్స్, తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

కాగా ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరిస్తామని.. త్వరలోనే వారి సమస్యలపై ఆయా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తగు నిర్ణయాలు తీసుకుంటానని మంత్రి తలసాని వారికి హామీ ఇచ్చారు.
Tags:    

Similar News