బాబు ప్రెస్ మీట్ చూసి షాక్ తిన్నాన‌న్న మంత్రి

Update: 2018-10-26 09:51 GMT
విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన దాడిపై పెద్ద ఎత్తున ఖండ‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన జ‌గ‌న్ ను.. అంత‌కు ముందు తెలంగాణ రాష్ట్ర తాజా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఒక‌ప్పుడు చంద్ర‌బాబుకు వీర విధేయుడైన త‌ల‌సాని.. తాజాగా త‌న ఎక్స్ బాస్ పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన దాడిని.. ఆ త‌ర్వాత ఇదే అంశంపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రెస్ మీట్ ను తాను చేసిన‌ట్లు చెప్పారు. జ‌గ‌న్ దాడిపైబాబు ప్రెస్ మీట్ చూసిన త‌ర్వాత ఆయ‌న మాట‌ల‌కు తాను షాక్ తిన్న‌ట్లు చెప్పారు.

సిగ్గు లేకుండా బాబు వ్యాఖ్య‌లు చేశార‌న్నారు. మీడియాతో మాట్లాడే సంద‌ర్భంగా బాబు బాష ఏ మాత్రం బాగోలేద‌ని.. ప్ర‌తిప‌క్ష నేత‌పై దాడి జ‌రిగిన వైనాన్ని ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి స్పందించే తీరు అలా ఉండొద్ద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

దాడికి గురైన జ‌గ‌న్ ను కేసీఆర్‌.. కేటీఆర్‌.. క‌విత‌లు ప‌రామ‌ర్శిస్తే త‌ప్పేంటి? అని ప్ర‌శ్నించారు త‌ల‌సాని. జ‌గ‌న్ ను ప‌రామ‌ర్శించే వారిని చంద్ర‌బాబు త‌ప్పు ప‌ట్ట‌టం ఏ మాత్రం స‌రికాద‌ని త‌ల‌సాని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నేత‌పై దాడి జ‌రిగిన‌ప్పుడు డీజీపీతో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడి వివ‌రాలు తెలుసుకుంటే బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

జ‌గ‌న్ దాడిపై బాబు ప్రెస్ మీట్ ప్ర‌స్తావించిన అంశాల‌పై త‌ల‌సాని మాత్ర‌మే కాదు.. ప‌లువురు ప్ర‌ముఖులు త‌ప్పు ప‌డుతున్నారు.సీఎం స్థానంలో ఉన్న వ్య‌క్తి అలా మాట్లాడ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News